PM Modi: ఇథియోపియా గడ్డపై భారత సాంస్కృతిక గీతం.. వందేమాతరం ఆలాపనతో మోదీ భావోద్వేగం!
ఇథియోఫియా ప్రధాని అబీ అహ్మద్ ఏర్పాటు చేసిన విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. మోదీ అక్కడికి వెళ్లిన తర్వాత ఇథియోపియన్ గాయకులు భారతీయ సాంస్కృతిక గీతం వందేమాతరాన్ని పాడి వినపించారు. విదేశీ గడ్డపై భారత సాంస్కృతిక గీతాన్ని విన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో సంతోషించారు.
ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని మంగళవారం అడిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం ప్రధాని అబీ అహ్మద్ ఏర్పాటు చేసిన విందుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే మోదీ అక్కడికి వెళ్లిన తర్వాత ఇథియోపియన్ గాయకులు భారతీయ సాంస్కృతిక గీతం వందేమాతరాన్ని పాడి వినపించారు. విదేశీ గడ్డపై భారత సాంస్కృతిక గీతాన్ని విన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో సంతోషించారు. ఆ గాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ.. చప్పట్లు కూడా కొట్టారు. ఈ మదుర క్షణాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. వందేమాతరం ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో, ఇది మనసును ఎంతగానో హత్తుకునే క్షణం అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

