మతిమరుపు తరిమికొట్టే ఎర్ర పండు.. మీరు తింటున్నారా?

16 December 2025

TV9 Telugu

TV9 Telugu

పప్పు, ఉప్మా, కిచిడీ..ఎందులో చూసినా టొమాటోలేనని విసుక్కుంటారు కొందరు. చారులోంచి కరివేపాకుని వేరుచేసినట్టు టొమాటో ముక్కల్ని తీసి పడేస్తుంటారు.

TV9 Telugu

దీన్లో పోషకాల గురించి తెలిస్తే ఇకపై అలా చేయలేరు. టొమాటోలో ఫోలేట్, పొటాషియం, విటమిన్‌ సి, విటమిన్‌ కె వంటి సూక్ష్మ పోషకాలు అధికం

TV9 Telugu

దీన్లో యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలం. ఇవి గుండెకు, మెదడుకు మేలు చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడి క్యాన్సర్‌ ముప్పుని తగ్గిస్తాయి

TV9 Telugu

టైప్‌ 2 డయాబీటిస్‌ ప్రమాదాన్ని నివారిస్తాయి. వీటిలోని పోషకాలు రక్తపోటునీ తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి

TV9 Telugu

దీన్లోని లైకోపీన్‌ కెరోటినాయిడ్‌ పిగ్మెంట్‌... ఆల్జీమర్స్‌ బారిన పడకుండా కాపాడుతుంది. ల్యూటేన్, జియాంజాంతిన్‌ డిజిటల్‌ పరికరాల నుంచి వెలువడే నీలికాంతి నుంచి కళ్లను రక్షిస్తాయి

TV9 Telugu

వీటిలోని ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఒక కప్పు టొమాటో రసంలో 45 మి.గ్రా. విటమిన్‌ సి ఉంటుంది. ఇది మనకు రోజులో అవసరమయ్యే దాన్లో 75 శాతానికి సమానం

TV9 Telugu

దాదాపు అన్ని వంటకాల్లో విరివిగా ఉపయోగించే టొమాటోల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వీటిలో విటమిన్లు ‘ఎ’, ‘సి’, పొటాషియం, క్యాల్షియం.. వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

TV9 Telugu

ఈ కాయగూరలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది. అందుకే కూరగాయల్లో కలిపి వండుతారో, కూర, పచ్చడి చేస్తారో టొమాటోని అయితే రోజూ ఇంట్లోవాళ్ల ఒంట్లోకి పంపండి