Vande Bharat Sleeper: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తొలి వందే భారత్ స్లీపర్ రైలుపై క్లారిటీ.. ఎక్కడినుంచంటే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరిలోనే ట్రాక్‌లపైకి రానున్నాయి. తొలి వందే భారత్ స్లీపర్ రైలుపై కీలక అప్డేట్ వచ్చింది. ఏయే ప్రాంతాల మధ్య నడుస్తుందనే విషయంపై అధికారిక వివరాలు బయటకొచ్చాయి.

భారతీయ రైల్వే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గమ్యస్థానాన్ని అతి త్వరగా చేరుకోవడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు లగ్జరీ ట్రైన్లను అందుబాటలోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్నీ ప్రధాన నగరాలకు వందే భారత్ సర్వీసులు అందుబాటులోకి ఉన్నాయి. ఇవి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా అత్యంత వేగంగా ప్రయాణికులు గమ్యస్థానికి చేరుకునే అవకాశం లభించింది. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లల్లో కూర్చోని వెళ్లే సౌకర్యం అందుబాటులో ఉండగా.. స్లీపర్ కోచ్‌లు లేవు. దీంతో దూరపు ప్రయాణాలు చేసేవారు కూర్చోని వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఇప్పటికే రైళ్ల తయారీ పూర్తవ్వగా.. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తొలి రైలు ఎక్కడంటే..?
ఈ క్రమంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలుపై క్లారిటీ ఇచ్చింది. పాట్నా-ఢిల్లీ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు. వెయ్యి కిలోమీటర్ల ప్రయాణాన్ని 8 గంటల్లో ఇది పూర్తి చేయనుంది. గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇప్పటికే ఈ ట్రైన్ ట్రయల్ రన్ పూర్తవ్వగా.. కొత్త ఏడాది ముందే దీనిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. వారానికి ఆరు రోజులు పాట్నా-ఢిల్లీ మధ్య ఇది నడుస్తుంది. 16 కోచ్‌లు ఇందులో ఉండగా.. ఛార్జీల వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలోనే ఇందులో సేవలు ఉంటాయని తెలుస్తోంది.
రాత్రిపూట ప్రయాణాల కోసం..
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాత్రిపూట ప్రయాణాల కోసం తీసుకొస్తున్నారు. దూరపు ప్రాంతాలకు వెళ్లేవారు రాత్రిపూట కూర్చోని ప్రయాణం చేయడం అసౌకర్యంగా ఉంటుంది. అదే స్లీపర్ కోచ్‌లలో అయితే సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా వేగంగా గమ్యస్ధానానికి చేరుకోవచ్చు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు.




