వింటర్ టూర్‌పై నో టెన్షన్.. కర్ణాటక మీ కోసం అటెన్షన్..
Prudvi Battula
Images: Pinterest
17 December 2025
పురాతన దేవాలయాలు, రాజ సముదాయాలు, భారీ రాతి నిర్మాణాలను వీక్షించవచ్చు. హేమకుట కొండ, మరపురాని సూర్యాస్తమాయం, కొరాకిల్ రైడ్‌ను ఆస్వాదించవచ్చు.
హంపి
రాజ వారసత్వ అద్భుతమైన నిర్మాణ శైలిని చూడవచ్చు. ఐకానిక్ మైసూర్ ప్యాలెస్, ఉత్సాహభరితమైన దేవరాజ మార్కెట్, ప్రశాంతమైన చాముండి కొండలను వీక్షించవచ్చు.
మైసూర్
భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటైన శివమొగ్గలోని జోగ్ జలపాతం. ఇది కర్ణాటకలో చాల అద్భుతమైన జలపాతం. ఒక్కసారైనా చూడాలి.
జోగ్ జలపాతం
ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ రద్దీ ఉన్న బీచ్‌లను చూడవచ్చు. ఓం బీచ్, కుడ్లే బీచ్, మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు.
గోకర్ణ
ఉత్కంఠభరితమైన అబ్బే జలపాతాలను, పచ్చని కాఫీ తోటలతో ప్రకృతి అందాల మధ్య హాయిగా ఉండే హోమ్‌స్టేను ఆస్వాదించవచ్చు.
కూర్గ్
చిక్కమగళూరులోని పచ్చని ఎస్టేట్‌లను, ముల్లయనగిరి శిఖరానికి హైకింగ్, భద్ర వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించవచ్చు.
చిక్కమగళూరు
బాదామిలోని రాతితో చేసిన గుహ దేవాలయాలు, పట్టడకల్‌లోని యునెస్కో జాబితాలో ఉన్న చాళుక్య దేవాలయాలు చూడవచ్చు.
బాదామి పట్టడకల్, ఐహోళే
లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్, కబ్బన్ పార్క్‌ను సందర్శించవచ్చు. నగరంలోని ఉత్సాహభరితమైన రాత్రి జీవితం, విభిన్న వంటకాల రుచి చూడవచ్చు.
బెంగళూరు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇలాంటి జాబ్స్ ఎంచుకున్నారంటే.. మీన రాశివారికి తిరుగులేదట..
మీకు నచ్చేలా.. అందరు మెచ్చేలా.. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చెయ్యాలంటే.?
ఒకేలాంటి చేపల కూర బోర్ కొడుతుందా.? ఈ డిఫరెంట్ రెసిపీలు ట్రై చెయ్యండి..