Bitter gourd: చేదు కారణంగా కాకర కాయలను దూరంపెడుతున్నారా.. చేదును తొలగించేందుకు ఇవే బెస్ట్ టిప్స్!

కాకరకాయ కర్రీ అనగానే అమ్మో.. అని పారిపోతూంటారు. చిన్నవాళ్లే కాదు పెద్దవారు సైతం కాకర కాయకు వీలైనంత వరకూ దూరంగానే ఉంటారు. కాకర కాయతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ఎవ్వరూ పట్టించుకోరు. నోటి రుచి మాత్రమే కావాలనుకుంటారు. కాకర కాయని క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక దీర్ఘకాలిక సమస్యలను తరిమి కొట్టొచ్చు. ఆయుర్వేదంలో కూడా కాకరకాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కాకరతో ఒక్కటేంటి.. ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ కాకర కాయలో ఉండే చేదు కారణంగా దాన్ని పక్కకు..

Bitter gourd: చేదు కారణంగా కాకర కాయలను దూరంపెడుతున్నారా.. చేదును తొలగించేందుకు ఇవే బెస్ట్ టిప్స్!
Bittergourd
Follow us
Chinni Enni

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 23, 2023 | 7:22 PM

కాకరకాయ కర్రీ అనగానే అమ్మో.. అని పారిపోతూంటారు. చిన్నవాళ్లే కాదు పెద్దవారు సైతం కాకర కాయకు వీలైనంత వరకూ దూరంగానే ఉంటారు. కాకర కాయతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా.. ఎవ్వరూ పట్టించుకోరు. నోటి రుచి మాత్రమే కావాలనుకుంటారు. కాకర కాయని క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక దీర్ఘకాలిక సమస్యలను తరిమి కొట్టొచ్చు. ఆయుర్వేదంలో కూడా కాకరకాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కాకరతో ఒక్కటేంటి.. ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ కాకర కాయలో ఉండే చేదు కారణంగా దాన్ని పక్కకు పెట్టేస్తారు. కానీ కొన్ని ఈజీ టిప్స్ తో కాకర కాయలో చేదును పొగొట్టవచ్చు. దీంతో హ్యాపీగా వండుకుని తినవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు వాటర్:

కాకర కాయలో నుంచి చేదు తీయాలంటే.. కట్ చేసిన కాకర కాయ ముక్కలను ఉప్పు నీటిలో వేయాలి. వీటిని సుమారు 15 – 20 నిమిషాల పాటు ఉప్పు వాటర్ లో ఉంచితే.. చేదు అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

తేనె లేదా చక్కెర వాటర్:

కాకర కాయలో నుంచి చేదును తొలగించు కోవడానికి ఈ టిప్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. తేనె లేదా చక్కెర కలిపిన నీటిలో వాటిని వేయాలి. ఇలా ఓ అరగంట సేపు షుగర్ కలిపిన నీటిలో ఉంచడం వల్ల చేదు తగ్గుతుంది.

పెరుగులో నానబెట్టండి:

పెరుగు కూడా కాకరలో ఉండే చేదును తగ్గిస్తుంది. కట్ చేసిన కాకర కాయ ముక్కలను పెరుగు లేదా మజ్జిగలో.. 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి, ఇలా చేస్తే చేదు తొలగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెరుగులో కాకర కాయ ముక్కలను వేసి ఓ పది నిమిషాలు ఉడికించినా చేదు తొలగుతుంది.

కాకరతో ముఖ్యమైన ప్రయోజనాలు:

* కాకర కాయను తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో, శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తుంది.

* కాకరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.

*కాకర కాయను క్రమం తప్పకుండా తీసుకుంటే.. రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

* కాకరో ఉండే పొటాషియం వల్ల రక్త పోటు అనేది కంట్రోల్ అవుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే కాకర కాయను తినడం వల్ల చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

(గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు)

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!