Mucus Reduce Tips: చలి కాలం ఎఫెక్ట్.. కఫంతో బాగా ఇబ్బంది పడుతున్నారా! ఇలా తగ్గించుకోండి..
చలి కాలంలో చాలా మంది సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్ద వారి దాకా గొంతు నొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, కఫం, గొంతుల గరగర వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ మాత్రం అలసత్వం వహించినా.. వెంటనే ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ కఫం అనేది బాగా చేరుతుంది. దీంతో వారు తినడానికి, తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే కాదు దగ్గు కూడా వస్తుంది. అయితే ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఆ సమస్యల్ని..
చలి కాలంలో చాలా మంది సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్ద వారి దాకా గొంతు నొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, కఫం, గొంతుల గరగర వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ మాత్రం అలసత్వం వహించినా.. వెంటనే ఎటాక్ చేస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ కఫం అనేది బాగా చేరుతుంది. దీంతో వారు తినడానికి, తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే కాదు దగ్గు కూడా వస్తుంది. అయితే ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఆ సమస్యల్ని పోగొట్టు కోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి? ఎలా కఫాన్ని తొలగించు కోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పునీటితో పుక్కిలించండి:
మీకు ఎప్పుడైనా కఫం పట్టినట్టు అనిపిస్తే.. వెంటనే ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి ఈ నీళ్లతో పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు, మూడు సార్లు చేస్తే కఫం కరిగి పోతుంది. చిన్న పిల్లలకు కూడా ఇలా చేయవచ్చు.
గోరు వెచ్చటి నీళ్లు తాగాలి:
కఫం పట్టిందని పిస్తే వెంటనే గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే, అలాగే పడుకునే ముందు ఇలా తాగితే త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.
పసుపు – మిరియాల పాలు:
సాధారణంగా గొంతు నొప్పి చేస్తే మిరియాల పాలు తాగుతారు. ఇది కఫాన్ని కరిగించడానికి కూడా పని చేస్తుంది. అందులో కొద్దిగా పసుపు వేసుకుని మరింత మంచి ఫలితం ఉంటుంది. అలాగే గోరు వెచ్చటి పాలలో కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు పసుపు కలిపి తాగినా ఉపశమనం లభిస్తుంది.
పుదీనా:
పుదీనాలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఘాటు వాసన ఉంటాయి. ఇవి కూడా కఫాన్ని కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. ఒక గ్లాస్ వాటర్ లో పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి వడబోయాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మ రసం కలిపి తాగితే కఫం బాగా కరుగుతుంది.
ఉల్లిపాయ – తేనె:
ఉల్లిపాయను ఒకటి తీసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో నుంచి రసం తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ లో ఉల్లి రసం, దానికి కొద్దిగా తేనె కలిపి మిక్స్ చేసుకుని వాటర్ ని తాగాలి. ఉల్లి పాయ, తేనెలో ఉండే ఔషధ గుణాలు కఫాన్ని కరిగించడంలో సహాయ పడతాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.