Health: మహిళలూ.. ఉన్నట్లుండి బరువు పెరుగుతున్నారా.? ఈ విషయాలు తెలుసుకోండి..
క్రమంగా బరువు పెరిగితే అది మన జీవన విధానం కారణంగా అని అర్థమవుతుంది. అలా కాకుండా ఉన్నట్లు ఒక్కసారిగా బరువు పెరిగితే మాత్రం కచ్చితంగా అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉన్నట్లుండి బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి.? ఏ సమస్యల వల్ల బరువు పెరుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు పెరగడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. సాధారణంగా ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమం తగ్గడం వల్ల బరువు పెరుగుతుంటారని తెలిసిందే. అయితే క్రమంగా బరువు పెరిగితే అది మన జీవన విధానం కారణంగా అని అర్థమవుతుంది. అలా కాకుండా ఉన్నట్లు ఒక్కసారిగా బరువు పెరిగితే మాత్రం కచ్చితంగా అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉన్నట్లుండి బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి.? ఏ సమస్యల వల్ల బరువు పెరుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
* మహిళలలు ఉన్నట్లుండి బరువు పెరగడానికి ప్రధాన కారణాల్లో పీసీఓఎస్ సమస్య ఒకటి. ఈ సమస్య వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా రావనే విషయం తెలిసిందే. దీనివల్ల శరీరంలో హార్మోన్లను దెబ్బతీసి.. వాటి సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే జీవక్రియలో మార్పులకు కారణమవుతుంది. వెరసి శరీరంలో కొవ్వు పెరిగి, బరువు పెరిగేలా చేస్తుంది.
* వయసు మల్లిన మహిళల్లో మెనోపాజ్ సమస్య సహజమైంది. ఇది మహిళల్లో బరువు పెరగడానికి కారణంగా మారుతుంది. ఈ సమస్య వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. దీంతో ఉన్నట్లుండి బరువు పెరుగుతారు. పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఆకస్మికంగా బరువు పెరుగుతారు.
* ఉన్నట్లుండి బరువు పెరగడానికి హైపో థైరాయిడిజం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే ఈ సమస్య వస్తుంది. ఉన్నట్లుండి బరువు పెరిగి, జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలి.
* మానసిక ఒత్తిడి కూడా ఉన్నట్లుండి బరువు పెరగడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి పెరిగితే.. శరీరం కార్టిసాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్‌ను పెంచుతుంది. దీంతో మీకు తెలియకుండానే ఎక్కువగా తింటుంటారు. వెరసి ఇది బరువు పెరగడానికి కారణంగా మారుతుంది.
* సరైన నిద్రలేకపోయినా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే.. శరీరంలో హార్మోన్లలో వ్యత్యాసాలు ఏర్పడుతాయి. దీంతో ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లు కంట్రోల్ తప్పుతాయి. ఈ కారణంగా అతిగా తింటుంటారు. దీంతో మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..