- Telugu News Photo Gallery Lifestyle Tips for Skin: These 5 Biggest Enemies Of Your Skin, Know What They Are
Skin Care Tips: ఈ ఐదు అలవాట్లు మానుకుంటే మొటిమల సమస్యకు చెక్ పెట్టొచ్చు..
శరీరంలో పోషకాల కొరత వల్ల అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. మొటిమలు, దురద, దద్దుర్లు కూడా చర్మ వ్యాధి లక్షణం కావచ్చు. చర్మ సమస్యలకు దూరంగా ఉండాలంటే జీవనశైలిపై దృష్టి పెట్టాలి. ఈ కింది అలవాట్లను అనుసరించడం ద్వారా మచ్చలేని పరిపూర్ణ చర్మాన్ని పొందవచ్చు. ఎక్కువ చక్కెర తినడం వల్ల ఇన్సులిన్ అసమతుల్యత ఏర్పడి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది. అలాగే ఎక్కువ చక్కెర తినడం వల్ల మొటిమలు, తామర వంటి సమస్యలు
Updated on: Nov 23, 2023 | 11:59 AM

శరీరంలో పోషకాల కొరత వల్ల అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. మొటిమలు, దురద, దద్దుర్లు కూడా చర్మ వ్యాధి లక్షణం కావచ్చు. చర్మ సమస్యలకు దూరంగా ఉండాలంటే జీవనశైలిపై దృష్టి పెట్టాలి. ఈ కింది అలవాట్లను అనుసరించడం ద్వారా మచ్చలేని పరిపూర్ణ చర్మాన్ని పొందవచ్చు.

ఎక్కువ చక్కెర తినడం వల్ల ఇన్సులిన్ అసమతుల్యత ఏర్పడి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది. అలాగే ఎక్కువ చక్కెర తినడం వల్ల మొటిమలు, తామర వంటి సమస్యలు తలెత్తుతాయి.

పొడి చర్మం సోరియాసిస్, ఎగ్జిమా వంటి వివిధ చర్మ సమస్యలను కలిగిస్తుంది. శీతాకాలంలో అవి మరింత తీవ్రమవుతాయి. అయితే ఈ సీజన్‌లో కొబ్బరినూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా అవకాడో ఆయిల్‌ని రోజూ వాడితే చర్మం హైడ్రేట్‌గా ఉండి మృదువుగా ఉంటుంది.

రోజుకి 3-4 కప్పుల కంటే ఎక్కువ టీ లేదా కాఫీ తాగుతున్నారా? టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫీన్ స్థాయి పెరుగుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేసి చర్మాన్ని డల్‌గా మార్చుతుంది. అంతేకాకుండా శరీరంలో కాలుష్య కారకాలు పేరుకుపోయి, చర్మ సమస్యలు పెరిగేలా చేస్తుంది.

రోజువారీ జీవితంలో ఒత్తిడిని శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఫలితంగా చర్మం జిడ్డుగా మారుతుంది. ఆయిలీ స్కిన్ వల్ల మొటిమలు, ఇతర చర్మ సమస్యలు పెరుగుతాయి.





























