- Telugu News Photo Gallery If you follow these tips, you can reduce the migraines that come during the cold season
Migraine Cure Tips: చలి కాలంలో మైగ్రైన్ ఎఫెక్ట్.. టెన్షన్ లేకుండా చెక్ పెట్టేయండిలా!
వాతావరణ పరిస్థితులు.. ఆహారపు అలవాట్లు మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అందులోనూ చలికాలంలో వచ్చే సమస్యల గురించి చెప్పాల్సిన పని లేదు. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి.. జ్వరం, జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో పాటు చలికి మైగ్రేన్ కూడా వేధిస్తుంది. ఈ తల నొప్పి వస్తే.. అంత తొందరగా పోదు. ఈ తల నొప్పి కారణంగా ఏ పనిపై ఫోకస్ కూడా పెట్టలేం. దానికి తోడు ఇప్పుడున్న బిజీ లైఫ్ కి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ కారణం చేత కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 24, 2023 | 3:01 PM

వాతావరణ పరిస్థితులు.. ఆహారపు అలవాట్లు మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అందులోనూ చలికాలంలో వచ్చే సమస్యల గురించి చెప్పాల్సిన పని లేదు. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి.. జ్వరం, జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో పాటు చలికి మైగ్రేన్ కూడా వేధిస్తుంది. ఈ తల నొప్పి వస్తే.. అంత తొందరగా పోదు. ఈ తల నొప్పి కారణంగా ఏ పనిపై ఫోకస్ కూడా పెట్టలేం.

దానికి తోడు ఇప్పుడున్న బిజీ లైఫ్ కి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ కారణం చేత కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మైగ్రైన్ నొప్పి అనేది తలకు ఒక వైపు మాత్రమే వస్తుంది. ఈ రకమైన తల నొప్పి వస్తే అస్సలు భరించలేరు.

ఈ మైగ్రేన్ నొప్పి పురుషుల్లో కంటే.. స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది. దీంతో మనిషి మనిషలో ఉండడు. దానికి ఇప్పుడున్న చలి కారణంగా ఇంకా ఎక్కువగా వస్తుంది. ఈ తల నొప్పి ఒక పూట వరకూ ఉంటుంది. ఈ మైగ్రేన్ ని తగ్గించాలంటే బెల్లం బాగా హెల్ప్ చేస్తుంది.

ఈ మైగ్రైన్ తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు గోరు వెచ్చటి ఆవు పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగాలి. ఇది తాగిన కొద్ది సేపటికే ఉపశమనం కలుగుతుంది. అలాగే అల్లం కూడా చాలా ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది.

మైగ్రేన్ ఎక్కువగా ఉన్నప్పుడు అల్లం రసంలో కొద్దిగా నిమ్మ రసం కలిపి తీసుకుంటే మంచి రిలీఫ్ నెస్ దొరుకుతుంది. అంతే కాకుండా నిద్ర లేమి సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇలా ఈ రెండు చిట్కాల్లో ఏది పాటించినా.. మైగ్రేన్ తల నొప్పి ఎగిరి పోతుంది.





























