Baking Soda: బేకింగ్ సోడాతో చిటికెలో వంట గది శుభ్రం.. ఈ టిప్స్ ఫాలో అయితేసరి!
కిచెన్ శుభ్రం చేయడం ప్రతి ఇల్లాలికి సవాలే. మొండి మరకలు, జిడ్డు ఎంతకీ శుభ్రం కావు. అయితే వంటింట్లో ఉండే బేకింగ్ సోడాతో ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. కేక్‌లను మెత్తగా తయారు చేయడం నుంచి కిచెన్‌ను శుభ్రం చేయడం వరకు-బేకింగ్ సోడా పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది. వంటకు మత్రమే కాకుండా, ఈ వంటగది శుభ్రం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది..
Updated on: Nov 23, 2023 | 11:37 AM

కిచెన్ శుభ్రం చేయడం ప్రతి ఇల్లాలికి సవాలే. మొండి మరకలు, జిడ్డు ఎంతకీ శుభ్రం కావు. అయితే వంటింట్లో ఉండే బేకింగ్ సోడాతో ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. కేక్‌లను మెత్తగా తయారు చేయడం నుంచి కిచెన్‌ను శుభ్రం చేయడం వరకు-బేకింగ్ సోడా పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది. వంటకు మత్రమే కాకుండా, ఈ వంటగది శుభ్రం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

వేడి నీళ్లలో బేకింగ్ సోడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా ఇంటి గోడలపై ఉండే మరకలను సులభంగా తొలగించవచ్చు. ఈ బేకింగ్ సోడా గిన్నెలపై మరకలను తొలగించడంతోపాటు వెండి వస్తువులను కూడా మెరిసేలా చేస్తుంది

బేకింగ్ సోడాకు ఎలాంటి వాసన లేనప్పటికీ, ఇది ఇతర వాసనలను సులభంగా తొలగించగలదు. కాబట్టి వంట గదిలో వాసన వస్తుంటే బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి తుడిస్తే సరి.

మార్కెట్ నుంచి కొనుగోలు చేసే పండ్లు, కూరగాయల్లో చాలా రసాయనాలు ఉంటాయి. అందువల్ల 1 టీస్పూన్ బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి, పండ్లు- కూరగాయలను అందులో కాసేపు ఉంచి శుభ్రంగా కడగాలి. డిష్ వాష్ అయిపోయినప్పుడు దాని స్థానంలో బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడాను నీళ్లలో కలిసి వెనిగర్ లేదా నిమ్మరసం జోడిస్తే సరి.. ఈ మిశ్రమం వంట పాత్రలను శుభ్రం చేయడంలో బలేగా పనిచేస్తుంది.

యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడేవారు బేకింగ్ సోడాలో కాసింత ఉప్పువేసి దీనిని తాగాలి. ఇది సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. బేకింగ్ సోడాతో ఫ్రిజ్‌ను కూడా శుభ్రం చేయవచ్చు. ఇది ఫ్రిజ్ వాసనను సులభంగా తొలగిస్తుంది.





























