- Telugu News Photo Gallery Technology photos Instagram planning to introduce new feature lets users disable read receipts for messages
Instagram: ఇన్‌స్టాలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీరు మెసేజ్ చూసినట్లు..
యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్‌ను తీసుకురావడంలో ఇన్‌స్టాగ్రామ్ ముందు వరుసలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఫీచర్స్‌ను జోడిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ను పరిచయం చేసిన ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు..
Updated on: Nov 23, 2023 | 10:59 AM

ప్రస్తుతం సోషల్ మీడియా సైట్స్ ప్రైవసీకి పెద్ద పీట వేస్తోంది. యూజర్ల వ్యక్తిగత వివరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సైతం కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొస్తోంది.

ఇప్పుడు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న మెసేజ్ డిజేబుల్ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకురానున్నారు. రీడ్ రెసిప్ట్స్‌ని డిజేబుల్ చేసేలా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు.

ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ సహాయంతో మీకు ఎవరైనా మెసేజ్ పంపిస్తే.. మీరు చూసినా ఎదుటి వ్యక్తికి తెలియకుండా సెట్టింగ్ చేసుకోవచ్చు. రీడ్ రెసిస్ట్స్‌ని డిజేబుల్ చేసుకుంటే ఎదుటి వారి స్టేటస్‌ను కానీ, మెసేజ్‌ను కానీ చూసినట్లు వారికి తెలియదు.

అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సెరి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ సెక్షన్లో రీడ్ రెసిప్ట్స్ అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవచ్చు. దీంతో ఇన్‌స్టాలో కూడా మెసేజ్ చూసినట్లు తెలియదు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందిరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.





























