AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Usirikaya Thokku Pachadi: ఈ చలికాలంలో ఉసిరికాయ తొక్కు పచ్చడి ఇలా చేయండి.. వేడి అన్నంలోకి అదిరి పోతుంది!

చలి కాలంలో ఆహారాన్ని వేడి వేడిగా తీసుకోవాలి. చలికి సాధారణమైన పదార్థాలు తినబుద్ది కాదు. కారంగా పుల్లగా ఉండే వాటిని తినాలి అనిపిస్తుంది. అందుకే ఎండా కాలంలో పెట్టిన ఆవకాయ పచ్చడిని.. చలి కాలంలో తింటారు. అలాగే ఉసిరి కాయల పచ్చడి కూడా పెడుతూ ఉంటారు. ఈ సీజన్ లో ఉసిరి కాయలు అనేవి విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఉసిరి కాయతో కూడా చాలా రకాల పచ్చళ్లను పెడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఉసిరి కాయ తొక్కు పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే..

Usirikaya Thokku Pachadi: ఈ చలికాలంలో ఉసిరికాయ తొక్కు పచ్చడి ఇలా చేయండి.. వేడి అన్నంలోకి అదిరి పోతుంది!
Usirikaya Thokku Pachhadi
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 22, 2023 | 10:30 PM

Share

చలి కాలంలో ఆహారాన్ని వేడి వేడిగా తీసుకోవాలి. చలికి సాధారణమైన పదార్థాలు తినబుద్ది కాదు. కారంగా పుల్లగా ఉండే వాటిని తినాలి అనిపిస్తుంది. అందుకే ఎండా కాలంలో పెట్టిన ఆవకాయ పచ్చడిని.. చలి కాలంలో తింటారు. అలాగే ఉసిరి కాయల పచ్చడి కూడా పెడుతూ ఉంటారు. ఈ సీజన్ లో ఉసిరి కాయలు అనేవి విరివిగా దొరుకుతూ ఉంటాయి. ఉసిరి కాయతో కూడా చాలా రకాల పచ్చళ్లను పెడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఉసిరి కాయ తొక్కు పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే.. ఆహా అనాల్సిందే. చెబుతుంటేనే నోరు ఊరి పోతుంది కదా.. నిజంగానే అలా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకం పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా చేసుకుని తినండి. ఇది చేయడం కూడా ఈజీనే. మరి ఈ ఉసిరి కాయ తొక్కు పచ్చడిని ఎలా చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి కాయ తొక్కు పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

ఉసిరి కాయలు, నూనె, ఉప్పు, పసుపు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మ రసం, ఎండు మిర్చి, కరి వేపాకు.

ఇవి కూడా చదవండి

ఉసిరి కాయ తొక్కు పచ్చడి:

ముందుగా ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి పక్కకి పెట్టు కోవాలి. తర్వాత ఉసిరి కాయలను లోపల కట్ చేసి గింజలను తీసేయాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసు కోవాలి. తర్వాత ఉసిరి కాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. ఇవి బాగా మగ్గాక.. ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ వేసి వేడి చేయాలి. మెంతులు, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత మరొకటి వేసి దోరగా వేయించాలి. తర్వాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉసిరి కాయ ముక్కలు, నిమ్మ రసం వేసి మెత్తగా మిక్సీ పట్టు కోవాలి.

ఆ నెక్ట్స్ చిన్న కడాయి తీసుకోవాలి. తాళింపుకు సరిపడగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక తాళింపు సరుకులు వేసి వేయించు కోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరి కాయ తొక్కు పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్ లో కూడా పెట్టు కోవచ్చు. ఒకటి రెండు రోజుల పాటు నిల్వ ఉంటుంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్