Kartikeya: కుర్ర హీరో మాస్టర్ ప్లాన్.. బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టనున్న కార్తికేయ
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కుర్రహీరో కార్తికేయ. తొలిసినిమా తోనే సాలిడ్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కుర్రహీరో కార్తికేయ(Kartikeya). తొలిసినిమా తోనే సాలిడ్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోగా దూసుకుపోతున్న సమయంలోనే కార్తికేయ విలన్ గాను మారాడు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు. ఆతర్వాత ఏకంగా తమిళ్ స్థార్ హీరో అజిత్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు కార్తికేయ. వలిమై సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సక్సెస్.. ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను కార్తికేయ చేస్తున్నాడు. అయితే వలిమై సినిమా తర్వాత కార్తికేయ చిన్న గ్యాప్ ఇచ్చాడు. తన నెక్స్ట్ సినిమా ఏంటి అని ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు ఈ కుర్ర హీరో.
అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో బాలీవుడ్ పైన ద్రుష్టి పెట్టనున్నాడని తెలుస్తుంది. ఇటీవల తెలుగు హీరోలు బాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియాల పుణ్యమా అని మన సినిమా ప్రపంచవ్యాప్తంగా కీర్తిగడిస్తుంది. ఈ క్రమంలోనే కార్తికేయ కూడా బాలీవుడ్ లో అడుగు వేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న సినిమాలతోపాటు గతంలో విడుదలైన సినిమాలను కూడా ఇప్పుడు హిందీలో డబ్ చేయాలని చూస్తున్నాడట కార్తికేయ. తన సినిమాలు ఆన్ లైన్ ద్వారా లేదా శాటిలైట్ ద్వారా అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట కార్తికేయ. మరి ఈ కుర్ర హీరో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :