Mahesh Babu: మహేష్- త్రివిక్రమ్ సినిమాకు మరోసారి అదే టైటిల్ అనుకుంటున్నారట.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సర్కారు వారి పాట సానియాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సర్కారు వారి పాట సానియాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీలో టెలికాస్ట్ అయితే ఛానల్ మార్చకుండా చూసేవారు ఉన్నారు. అంతలా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో మూవీ రాబోతుందని అనౌన్స్ చేయడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే మహేష్ తో త్రివిక్రమ్ ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరిగాయి. వచ్చే నెలనుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది . త్రివిక్రమ్ కు సినిమా టైటిల్స్ లో అ అక్షరం సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు మహేష్ సినిమాకు అదే అక్షరంతో మొదలైయ్యే టైటిల్ ను అనుకుంటున్నారట. ఈ మూవీ అర్జునుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. గతంలో మహేష్ అర్జున్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే టైటిల్ తో రాబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :