Akhil Akkineni : మెగాస్టార్ డైరెక్టర్‌తో అక్కినేని కుర్రహీరో సినిమా.. ఆ దర్శకుడు ఎవరంటే
అక్కినేని కుర్ర హీరో అఖిల్.. సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. యాక్షన్ డైరెక్టర్ వివినాయక్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్.
అక్కినేని కుర్ర హీరో అఖిల్(Akhil Akkineni ).. సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. యాక్షన్ డైరెక్టర్ వివినాయక్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. తన పేరుతోనే అఖిల్ అనే సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ దర్శకత్వంలో హలో అంటూ పలకరించాడు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా అఖిల్ కు హిట్ ఇవ్వలేకపోయింది. ఆ వెంటనే మిస్టర్ మజ్ను అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. అయినా కూడా హిట్ అందుకోలేకపోయాడు. దాంతో చిన్న గ్యాప్ తీసుకున్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు అఖిల్.
అయితే అక్కినేని అభిమానులకు ఈ సినిమా హిట్ అసిపోలేదనే చెప్పాలి. అఖిల్ నుంచి సాలిడ్ హిట్ ను ఎక్స్పెట్ చేస్తున్నారు అఖిల్ ఫ్యాన్స్. దాంతో ఇప్పుడు మరోసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించడానికి రెడీ అయ్యాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఏజెంట్ అనే టైటిల్ తో వస్తున్న ఈ థ్రిల్లర్ లో అఖిల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాతర్వాత అఖిల్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనే టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో మోహన్ రాజా తో అఖిల్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మోహన్ రాజా మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ తో మోహన్ సినిమా ఉండనుందని అంటున్నారు. ఇప్పటికే తన దగ్గర ఒక కథ ఉందని ఆ కథకు అఖిల్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని మోహన్ రాజా భావిస్తున్నారట. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.