Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. గుడి నుంచి బయటకు పంపించేసిన అర్చకులు.. ఏం జరిగిందంటే?
సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణు స్వామికి ఘోర అవమానం ఎదురైంది. తాజాగా ఓ ప్రఖ్యాత ఆలయ సందర్శనకు వెళ్లిన ఆయనను అర్చకులు, పూజారులు అడ్డుకున్నారు. గుడిలోకి అడుగు పెట్టకుండా బయటకు పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణు స్వామికి ఘోర అవమానం ఎదురైంది. బుధవారం (ఆగస్టు 20) ఆయన అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయానికి సందర్శించుకోవడనికి వెళ్లగా.. అక్కడి పండితులు అడ్డుకున్నారు. గుడి లోపలకు రాకుండా బయటకు పంపించేశారు. గత కొన్ని రోజులుగా కామాఖ్య ఆలయ అర్చకులు, పండితులు, పూజారులు, సిబ్బంది వేణు స్వామిపై గుర్రుగా ఉన్నారు. ఈ ఆలయం గురించి ఇటీవల వేణు స్వామి చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఇప్పుడీ కారణంగానే వేణు స్వామిని కామాఖ్య ఆలయ అర్చకులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ సందర్భంలో కామాఖ్య ఆలయం గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. సంతానం లేనివారు కామాఖ్యా అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే.. ఏడాదిలోపు పిల్లలు పుడతారని వేణు స్వామి జోస్యం చెప్పారు. అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తాంచాలన్నారు. దీంతో వేణు స్వామిపై ఆలయ పండితులు గుర్రుగా ఉన్నారు. అమ్మవారి ఆలయం గురించి అపచారపు మాటలు మాట్లాడడం సరికాదని ఇది వరకే వేణు స్వామిని పండితులు హెచ్చరించారు. అలాగే వేణు స్వామి లక్షల్లో డబ్బులు తీసుకుని ఇక్కడ పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆగ్రహానికి మరో కారణం.
‘గుడి అంటే గుడి లాగే ఉండాలి. కామాఖ్య గుడితో గానీ గుడిలోని పూజలతో కానీ వేణు స్వామికి ప్రత్యక్ష సంబంధం లేదు. ఆయన లక్షలు తీసుకుని చేయించి చేసే పూజలు ఇక్కడ ఏమీ లేవు. ఆయన భక్తులను మోసం చేస్తున్నాడు. ఈ తతంగం గురించి కొద్ది రోజుల క్రితం మాకు తెలిసింది. ఈ విషయంపై వేణు స్వామిపై పోలీసు కేసు కూడా పెట్టేందుకు రెడీ అవుతున్నాం’ అని కామాఖ్య ఆలయ పండితుడు ఒకరు చెప్పుకొచ్చారు. మరి దీనిపై వేణు స్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా ఈ ఘటనకు ముందు వేణు స్వామి కామాఖ్య ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. పలు పూజలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు వేణు స్వామి.
కామాఖ్య ఆలయంలో వేణు స్వామి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








