Nikhil Abburi: ఏంటి.. ఈ ‘100% లవ్’ బుడ్డోడు ఇప్పుడు హీరో అయిపోయాడా? లేటెస్ట్ ఫొటోస్ చూస్తే షాక్ అవుతారు
గతంలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన చాలా మంది ఇప్పుడు హీరో, హీరోయిన్లు గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో 100 పర్సెంట్ మూవీతో పాటు పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఓ కుర్రాడు కూడా హీరోగా మారిపోయాడు. అతను నటించిన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య, తమన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 100%. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ పిల్లల బ్యాచ్ కూడా ఉంటుంది. అందులో బొద్దుగా, క్యూట్ గా ఓ బుడ్డోడు కూడా ఉంటాడు. సినిమాలో ఆ పిల్లాడి అల్లరి మామూలుగా ఉండదు. 100% మూవీతో పాటు ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోనూ ఆ పిల్లాడు యాక్ట్ చేశాడు. అందులో కమెడియన్ ను సత్యం రాజేష్ ను ఆట పట్టించే సీన్ లో అద్బుతంగా నటించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఆ అబ్బాయి పేరు నిఖిల్ అబ్బూరి. పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అతను ఇప్పుడు నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 90’s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి టాక్స్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లిటిల్ హార్ట్స్ సినిమాలో నిఖిల్ అబ్బూరి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజైంది. ఇందులో మౌళి వెంట ఉండే గ్యాంగ్ లో నిఖిల్ అబ్బూరి కూడా కనిపించాడు. అయితే చాలా మంది అతనిని గుర్తు పట్టలేకపోయారు.
ప్రముఖ నిర్మాత బన్నీవాసు కెరీర్ లో 100% లవ్ సినిమాకు చాలా ప్రత్యేక స్థానముంది. ఈ మూవీతోనే ఆయన నిర్మాతగా మారారు. ఇందులోనే నిఖిల్ అబ్బూరి ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడు. ఇప్పుడు అదే నిఖిల్ అబ్బూరి నటిస్తోన్న లిటిల్ హార్ట్స్ సినిమాను బన్నీ వాసు నే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా జరిగిన ఈవెంట్ కు నిఖిల్ కూడా హాజరయ్యాడు. కానీ నిర్మాత బన్నీ వాసుతో సహా చాలా మంది అతనిని గుర్తు పట్టలేకపోయాడరు. ఆ తర్వాత మౌలి నిఖిల్ ను స్టైజీ పైకి పిలిచి అందరికీ పరిచయం చేశాడు.

Nikhil Abburi Latest Photos
ఇక లిటిల్ హార్ట్స్ సినిమా విషయానికి వస్తే.. కోచింగ్ సెంటర్ల నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 12న థియేటర్స్‌లో విడుదల కానుంది.
నిఖిల్ అబ్బూరి ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
లిటిల్ హార్ట్స్ సినిమాలో నిఖిల్ అబ్బూరి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








