Amala Paul: చీరకట్టులో కట్టిపడేస్తున్న అందాల అమలాపాల్.. కుర్రకారు ఫిదా
అందాల భామ అమలా పాల్ ప్రధానంగా తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది.. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అనఖ. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Updated on: Aug 19, 2025 | 9:10 PM

అందాల భామ అమలా పాల్ ప్రధానంగా తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది.. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అనఖ. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అమలా పాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2010లో తమిళ చిత్రం మైనాలో నటించి తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం ఆమెకు విమర్శకుల ప్రశంసలు, గుర్తింపు తెచ్చిపెట్టింది.

అమలా పాల్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. అమలా పాల్ మిలి (2015) చిత్రంలో టైటిల్ రోల్‌కు ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు, రెండు SIIMA అవార్డులు గెలుచుకుంది. సింధు సామవేళి (2010)లో వివాదాస్పద పాత్రతో కూడా చర్చలో నిలిచింది ఈ అందాల తార.

అమలా పాల్ 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకుంది, కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. 2023లో అమలా జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది. 2024 జూన్ 11న వీరికి ఇలాయ్ అనే కొడుకు జన్మించాడు.

ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు తల్లిగా తన జీవితాన్ని ఆనందిస్తూ, సోషల్ మీడియాలో అభిమానులతో అప్‌డేట్స్ పంచుకుంటోంది. సినిమాల స్పీడ్ తగ్గించిన ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.