AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thiruveer: తండ్రి కాబోతున్న ‘మసూద’ హీరో.. గ్రాండ్‌గా భార్య సీమంతం.. సందడి చేసిన ‘బలగం’ బ్యూటీ

టాలీవుడ్ హీరో, మసూద మూవీ ఫేమ్ తిరువీర్ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. తాజాగా తిరువీర్ భార్య సీమంతం గ్రాండ్ గా జరిగింది. బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ ఈ వేడుకకు హాజరై తిరువీర్ దంపతులకు విషెస్ చెప్పింది.

Thiruveer: తండ్రి కాబోతున్న 'మసూద' హీరో.. గ్రాండ్‌గా భార్య సీమంతం.. సందడి చేసిన 'బలగం' బ్యూటీ
Thiruveer
Basha Shek
|

Updated on: Aug 19, 2025 | 6:08 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలంగాణ అబ్బాయిల్లో తిరువీర్ ఒకడు. 2016 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఈ కుర్రాడు హీరోగా, సహాయక పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాల్లో తిరువీర్ పోషించిన పాత్రలకు ప్రశంసలు దక్కాయి. ఘాజీ, మల్లేశం, టక్ జగదీష్ తదితర సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించిన తిరువీర్ ‘మసూద’సినిమాతో హీరోగా మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత పరేషాన్, మోక్షపటం సినిమాల్లోనూ హీరోగా మెప్పించాడీ ట్యాలెంటెడ్ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే.. తిరువీర్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రి కానున్నాడు. ప్రస్తుతం అతని భార్య గర్భంతో ఉంది. అయితే ఈ శుభవార్తను తిరువీర్ కానీ, అతని కుటుంబ సభ్యులెవరూ బయట పెట్టలేదు. మసూద సినిమాలో తిరువీర్ తో కలిసి నటించిన బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సోమవారం (ఆగస్టు 19) తిరువీర్ భార్య సీమంతం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కావ్య కూడా హాజరైంది. కాబోయే తల్లిదండ్రులకు విషెస్ చెప్పింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తిరువీర్ దంపతులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకుంటూ మరో సారి వారికి శుభాకాంక్షలు చెప్పింది. దీంతో ఆ ఫొటో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తిరువీర్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

భార్యతో తిరువీర్..

View this post on Instagram

A post shared by Thiruveer P (@thiruveer)

తిరువీర్ భార్య పేరు కల్పన. గతేడాది వీరి వివాహం జరిగింది. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ లవ్లీ కపుల్. ఇక ఈ ఏడాది మార్చిలో తన సొంతూరులో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు. ‘ ‘రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక’ అని తన ఇంటి ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తిరువీర్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ లో హీరగా నటిస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. దీంతో పాటు ‘భగవంతుడు’ అనే మరో మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లతో తిరువీర్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

గృహప్రవేశం వేడుకలో..

View this post on Instagram

A post shared by Thiruveer P (@thiruveer)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..