AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రైలులో 59 మంది సజీవ దహనం.. ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ.. అసలు మిస్ కావొద్దు

ఈ మధ్యన నిజ జీవితంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే.

OTT Movie: రైలులో 59 మంది సజీవ దహనం.. ఓటీటీలో గూస్ బంప్స్ తెప్పించే రియల్ స్టోరీ.. అసలు మిస్ కావొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 19, 2025 | 9:10 PM

Share

రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కే సినిమాలకు అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో వీటికి రికార్డు వ్యూస వస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే పలువురు ఫిల్మ్ మేకర్లు, ఓటీటీ సంస్థలు బయోపిక్స్, రియల్ స్టోరీలంటూ ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే.. గతేడాది నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈమూవీకి విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద మంచిగానే వసూళ్లు వచ్చాయి. 2002 లో దేశాన్ని కుదిపేసిన ఒక మారణ హోమం అధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కదులుతున్న రైలులో 59 మంది సజీవ దహనమైన ఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అప్పటివరకు ఈ దారుణ ఘటనపై ఉన్న అపోహలు, అబద్ధాలను ఈ సినిమా చేరిపేసిందంటూ కాంప్లిమెంట్స్ వినిపించాయి. సుమారు 2 గంటల 7 నిమిషాల పాటు సాగే ఈ సినిమాకు IMDb లో 8.2/10 రేటింగ్ కూడా రావడం విశేషం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో ఈ సినిమాను చూసి ‘ అసలు నిజం బయటకొచ్చింది’ అని ట్వీట్ చేసి ప్రశంసించారు కూడా. ఉత్కంఠ రేపే సీన్లతో ఆద్యంతం ఎమోషనల్ గా సాగా ఆ సినిమా పేరు సబర్మతీ రిపోర్ట్.

2002లో దేశాన్ని కుదిపేసిన గోధ్రా రైలు దహన ఘటన సబర్మతీ రిపోర్ట్ ను తెరకెక్కించారు మేకర్స్. ధీరజ్ సర్నా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ో విక్రాంత్ మాస్సీ , రాశి ఖన్నా , రిద్ధి డోగ్రా, బర్కా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, వికిర్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, అమూల్ వి. మోహన్, అన్షుల్ మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన సినిమా..

2024 నవంబర్ 15న థియేటర్లలో రిలీజైన ది సబర్మతీ రిపోర్ట్ 2025 జనవరి 10 నుంచి ఓటీటీలోకి వచ్చింది. జీ5 ఓటీటీలో హిందీ, తెలుగు, తమిళ ఆడియోలతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. జియో టీవీలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..