AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Agnipariksha: ‘అగ్నిపరీక్ష’ను అధిగమించిన మాస్క్ మ్యాన్.. బిగ్ బాస్‌లోకి పక్కా! ఇంతకీ ఇతనెవరో తెలుసా?

'డబుల్ హౌస్.. డుబుల్ డోస్.. డబుల్ ఎంటర్ టైన్మెంట్' అంటూ బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది.

Bigg Boss Agnipariksha: 'అగ్నిపరీక్ష'ను అధిగమించిన మాస్క్ మ్యాన్.. బిగ్ బాస్‌లోకి పక్కా! ఇంతకీ ఇతనెవరో తెలుసా?
Bigg Boss Telugu 9 Agnipariksha
Basha Shek
|

Updated on: Aug 20, 2025 | 6:59 AM

Share

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. సెలబ్రిటీలతో పాటు సామాన్య జనాలకు కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనే సువర్ణావకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష అంటూ సరికొత్త కాంటెస్ట్ ను ప్రకటించారు. ఇందుకోసం సుమారు 20 వేల మంది దరఖాస్తు చేసుకోగ దశలవారీగా వారిని ఫిల్టర్‌ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కేవలం ఐదుగురిని బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ కు ఎంపిక చేయనున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ అయిదుగురు కంటెస్టెంట్లు ఎవరో కూడా తెలిసిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 కు ఎంపికైన కంటెస్టెంట్లలో మాస్క్ మ్యాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతని పేరు హరీష్ అట. అగ్ని పరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్కులన్నింటినీ ఈజీగా కంప్లీట్ చేశాడట మాస్క్ మ్యాన్. కొన్ని టాస్కుల్లో ఇతని స్పీడ్ ని చూసి జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారట. కాబట్టి ఇతను బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగు పెడితే ఫన్ అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావించిందట. అందుకే చూడడానికి ఎంతో ఫన్నీ గా కనిపించే ఈ మనిషిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేశారట.

అయితే బిగ్ బాస్ హౌస్ రాణించాలంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండాలి. కానీ ఈ మాస్క్ మ్యాన్ లో అదేమీ లేదని తెలుస్తోంది. పైగా హౌస్ లోకి ఎంటరయ్యాక తోటి కంటెస్టెంట్స అందరితోనూ కలిసిపోవాల్సి ఉంది. గ్రూప్ టాస్కులు కూడా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మాస్క్ మ్యాన్ లో ఆ కలివిడితనం లేదు. పైగా ఇతను షో మొత్తం మాస్క్ పెట్టుకొనే కనిపిస్తాడట. మరి దీనిని బిగ్ బాస్ ఆడియెన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ ప్రోమో..

మాస్క్ మ్యాన్ తో పాటు శ్వేతా శెట్టి, ప్రియా శెట్టి, దివ్యాంగుడు ప్రసన్న కుమార్, ఆర్మీ జవాన్ శ్రీధర్ లు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో  వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..