Ravanasura: అదరగొట్టిన మాస్ రాజా రావణాసుర థీమ్ సాంగ్..
సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్ కనిపించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన మాస్ రాజా ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.
మాస్ మహారాజ రవితేజ వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు.ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రావణాసుర అనే థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్ కనిపించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన మాస్ రాజా ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రావణాసుర సినిమా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమానుంచి రావణాసుర థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రావణాసుర థీమ్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 7,2023న రావణాసురు గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో రవితేజ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని అంటున్నారు రవితేజ ఫ్యాన్స్.