11 December 2025

చెక్కు చెదరని అందం.. ఫిట్‌నెస్ కోసం స్నేహ ఏం చేస్తుందంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో స్నేహ ఒకరు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్నేహ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ.. ఇప్పుడు వ్యాపారంలో బిజీగా ఉంది. 

ప్రస్తుతం స్నేహ వయసు 44 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరని అందం, ఫిట్‌నెస్ తో కట్టిపడేస్తుంది. తాజాగా తన డైట్ సీక్రెట్స్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

స్నేహా తన బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందట. రోజూ యోగా, వ్యాయామాలు చేస్తుందట. శరీరాకృతి, బరువు విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుందట.

రోజులో ఎన్ని కేలరీలు తీసుకుంటారనే విషయాన్ని తెలుసుకుంటుందట. అలాగే పిండి పదార్థాలు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటుందట.

అలాగే ఎక్కువగా హైడ్రేట్ గా ఉండేందుకు నీళ్లు తీసుకుంటుందట. తక్కువ మసాలా, తక్కువ ఉప్పు ఉండే ఆహారం తీసుకుంటానని.. నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకుంటుందట.

అలాగే ప్రతిరోజూ కేలరీలలో ఆహారం తీసుకోవడమే కాకుండా బరువు తగ్గడానికి చక్కరకు సైతం దూరంగా ఉంటుందట. అందానికి మానసిక ప్రశాంతత ముఖ్యమంటుంది.

ప్రస్తుతం స్నేహా చెప్పిన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాల్లో నటిస్తున్న స్నేహా.. ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.