గుడిలో దొంగలుపడ్డారు.. భగవంతుడిపై భక్తి లేదు.. అమ్మోరంటే భయం లేదు..
'కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ... తెట్టలాయ మహిమలే తిరుమల కొండ'... అన్నమయ్య ఎంత ఆర్తితో కీర్తించాడో ఆ తిరుమల కొండని. 'ఎదురుగా ఉన్నది కొండే అనుకుంటున్నావేమో, కాదు అది సాక్షాత్తు వైకుంఠం ' అని ఎలుగెత్తి పాడారు ఆ పదకవితా పితామహుడు. నాలుగు వేదాలే శిలలుగా ఆ తిరుమల కొండ పుట్టిందన్నాడు. అందులోని ప్రతి పదార్థం, అణవణువూ పరమ పవిత్రం.

యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన వార్త.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో వాడిన నెయ్యి వ్యవహారం. అయ్యో.. ఏంటి దీనికి ప్రాయశ్చిత్తం అని ఎన్ని లక్షల మంది ఆరా తీశారో ఆ సమయంలో. అందులో ఎంత వాస్తవం ఉందో ఎంక్వైరీలో తేలుతుంది. బట్.. ఆ అంశం భక్తుల మనోభావాలను దెబ్బతిసిందన్నది నిజం. నమ్మకంతో ఆటలాడింది నిస్సందేహం. దాన్నుంచి తేరుకోకముందే… జీర్ణించుకోలేని మరో ఘటన బయటికొచ్చింది. పట్టు వస్త్రాలని చెప్పి పాలిస్టర్‌వి అంటగట్టారనే ఆరోపణ అది. పదేళ్లుగా జరుగుతున్న అవినీతి జరుగుతోందని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. అసలు.. దేవుడితో ఏంటీ చెలగాటాలు? భక్తుల విశ్వాసాలతో ఎందుకన్ని ఆటలు? ‘కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ… తెట్టలాయ మహిమలే తిరుమల కొండ’… అన్నమయ్య ఎంత ఆర్తితో కీర్తించాడో ఆ తిరుమల కొండని. ‘ఎదురుగా ఉన్నది కొండే అనుకుంటున్నావేమో, కాదు అది సాక్షాత్తు వైకుంఠం ‘ అని ఎలుగెత్తి పాడారు ఆ పదకవితా పితామహుడు. నాలుగు వేదాలే శిలలుగా ఆ తిరుమల కొండ పుట్టిందన్నాడు. అందులోని ప్రతి పదార్థం, అణవణువూ పరమ పవిత్రం. శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతిలో దిగగానే.. ఇక మరేం వినబడదు. కొండ ముందు భక్తుడు.. ఆ కొండను చూడగానే వచ్చే మైమరపు. అంతే. అసలు ఆ కొండలోని ప్రతి అణువూ స్వామివారే. అలాంటి కొండపై భక్తుడి పాదస్పర్శ తగలగానే అంతటి శ్రీహరే పులకించిపోతాడు. తరించాలే గానీ.. ఆ మలయప్పే దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్న అనుభూతి...




