11 December 2025
ఫిట్‌నెస్ కోసం నయనతార ఈ 6 విషయాలు ఫాలో అవుతుందట..
Rajitha Chanti
Pic credit - Instagram
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది నయనతార. ఇప్పటికీ తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. తాజాగా తన ఫిట్‌నెస్ విషయాలు పంచుకుంది ఈ బ్యూటీ.
నయనతార తన ఫిట్‌నెస్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది. కార్డియో, వెయిట్ ట్రైనింగ్ ఆమెకు ఇష్టమైన వ్యాయామాలు.
నయనతార క్రాష్ డైట్‌లను పాటించదు. ఆమె పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు, ప్రోటీన్ , ఫైబర్ అధికంగా ఉండే ఏదైనా ఆహారాన్ని తీసుకుంటుంది.
ఆమెకు కొబ్బరి నీళ్లు చాలా ఇష్టం. తన రోజును కొబ్బరి నీళ్లు లేదా కొబ్బరి స్మూతీతో ప్రారంభిస్తుంది. వీటిలో ఖనిజాలు పుష్కలంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి
నయనతార తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి చక్కెరకు దూరంగా ఉంటుంది. తన ఆహారంలో శుద్ధి చేసిన చక్కెరను, ఆ పదార్థాలను అస్సలు తీసుకోదు.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి అలాగే శరీరం సరైన పనితీరుకు సమతుల్య హైడ్రేషన్ స్థాయిని నిర్వహించడం చాలా ముఖ్యం అంటుంది లేడీ సూపర్ స్టార్.
నయనతార తన ఆహారంలో కొబ్బరి నీళ్ళు మాత్రమే కాకుండా పండ్ల రసాలు, సూప్‌లు, ప్రతిరోజూ 4-5 లీటర్ల నీటిని కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్