Murugadoss: దర్బార్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన మురగదాస్
ఇటీవల మురగదాస్ తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసినప్పటికీ హిట్ అందుకోలేకపోయారు మురగదాస్.
సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో మొదటి వరసలో ఉంటారు డైరెక్టర్ మురగదాస్. ఎన్నో సూపర్ హిట్స్ ను తెరకెక్కించారు మురగదాస్. ఇటీవల మురగదాస్ తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేసినప్పటికీ హిట్ అందుకోలేకపోయారు మురగదాస్. రజినీకాంత్ హీరోగా మురగదాస్ తెరకెక్కించిన సినిమా దర్బార్. ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేద థామస్ రజినీకాంత్ కూతురిగా నటించింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా స్పందించారు దర్శకుడు మురగ దాస్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్బార్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి రీజన్ చెప్పారు. 2020లో వచ్చిన దర్బార్ సినిమా తర్వాత మురగదాస్ మరో సినిమా చేయలేదు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. దర్బార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి నేను కూడా గట్టిగానే ప్రయత్నించా.. అయితే ఆ సినిమా తర్వాత రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. దాంతో నాకు ఎక్కువ సమయం లేకుండా పోయింది. దాంతో ఆ సినిమాను హడవిడిగా తెరకెక్కించాం.. దర్బార్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే అని నేను అనుకుంటున్నా అని అన్నారు మురగదాస్.