AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కామ్రేడ్ల కంచుకోటలో ఎగిరిన బీజేపీ జెండా.. ప్రధాని మోదీ సంచలన ట్విట్..

కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 101 వార్డులలో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 50 వార్డులను గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది.

PM Modi: కామ్రేడ్ల కంచుకోటలో ఎగిరిన బీజేపీ జెండా.. ప్రధాని మోదీ సంచలన ట్విట్..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2025 | 4:05 PM

Share

కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 101 వార్డులలో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 50 వార్డులను గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది. దీంతో పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకోగా.. ఎల్‌డీఎఫ్ 29 వార్డుల్లో విజయం సాధించింది. 19 వార్డులను యూడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. తిరువనంతపురంలో బీజేపీ సత్తా చాటడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.. బిజెపి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ.. కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అంటూ ట్వీట్ చేశారు..

ప్రధాని మోదీ ట్వీట్..

‘‘ తిరువనంతపురం ధన్యవాదాలు! తిరువనంతపురం కార్పొరేషన్‌లో బిజెపి-ఎన్‌డిఎకు లభించిన ఆధిక్యత కేరళ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. ఈ శక్తివంతమైన నగరం అభివృద్ధికి, ప్రజలకు ‘జీవన సౌలభ్యాన్ని’ పెంపొందించడానికి మా పార్టీ కృషి చేస్తుంది.

తిరువనంతపురం కార్పొరేషన్‌లో అద్భుతమైన ఫలితాన్ని సాధించడంలో ప్రజల మధ్య పనిచేసిన కష్టపడి పనిచేసే బిజెపి కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. కేరళలోని అట్టడుగు స్థాయిలో పనిచేసిన తరతరాలుగా కార్యకర్తల కృషి.. పోరాటాలను గుర్తుచేసుకునే రోజు ఈ రోజు.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా.. తిరువనంతపురంలో 2020లో జరిగిన ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి. అయితే.. వచ్చే ఏడాది కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో… తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. 45 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టు కంచుకోటలో బీజేపీ పాగా వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us