12 December 2025

చేసింది మూడు సినిమాలు.. రెండే హిట్లు.. దెబ్బకు సినిమాలకు దూరం..

Rajitha Chanti

Pic credit - Instagram

బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు పలువురు తారలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అమ్మడు సైతం ఆ జాబితాలోకి వస్తుంది.

తనే హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్. తెలుగులో బాలనటిగా అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగులో కథానాయికగా మూడు సినిమాల్లో నటించింది. అందులో రెండు సూపర్ హిట్ కాగా.. ఒకటి డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

మసూద సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్  రామ్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఆతర్వాత వేణు దర్శకత్వంలో బలగం సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.

కానీ కథానాయికగా ఆమె నటించిన ఉస్తాద్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మరోవైపు మంచి ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది.