- Telugu News Photo Gallery Egg Yolk Benefits: Why You Should Eat Whole Eggs for Optimal Brain Function
ఎగ్‌వైట్ మాత్రమే తిని.. పచ్చసోనా పడేస్తున్నారా?.. ఇది తెలిస్తే పొరపాటున కూడా అలా చేయరు!
Egg Yolk Benefits: గుడ్లు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయన్న విషయం అందిరికీ తెలుసూ అందుకే వైద్యులు కూడా తరచూ వాటిని తినమని సూచిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం..గుడ్డులోని ఎగ్‌వైట్ మాత్రమే తిని.. పచ్చసోనాను పక్కన పెట్టడం లేదా పడేయం చేస్తారు. కానీ దాని వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. కాబట్టి పచ్చసోనా వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నయో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Dec 13, 2025 | 3:47 PM

మెదడు పనితీరు: గుడ్డులోని పచ్చసొనను చాలా మంది తినకుండా వదిలేస్తారు. కానీ నిజానికి, ఇది మెదడును మెరుగుపరిచే ఒక అద్భుతమైన పదార్థం. పచ్చసొనలో జ్ఞాపకశక్తిని పెంచే, అభ్యాసాన్ని ఉత్తేజపరిచే, నరాలను రక్షించే అద్భుతమైన లక్షణాలను ఉంటాయి. ఇవి మీ మెదడు పనితీరును ఎంతగానో మెరుగుపరుస్తాయి. కాబట్టి మీరు రోజువారి ఆహారంలో గుడ్లు చేర్చుకోవడంతో మీ మెదడు షార్ప్‌గా ఉంచుకోవచ్చు.

గుడ్డులోని పచ్చసొనలో కేవలం కొవ్వు మాత్రమే కాదు..ఇందులో కోలిన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, లుటీన్, జియాక్సంతిన్, విటమిన్ల బి వంటి అనే పోషకాలు ఉంటాయి. ఇవి మీ మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమవుతాయి. దీనిలో ఉండే 'కోలిన్' కంటెంట్ మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది మెదడు న్యూరాన్ల ఏర్పాటుకు సహాయపడుతుంది. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా లేదా గుర్తుంచుకోవాలనుకున్నా, మీకు ఈ పోషకం ఎంతో అవసరం

మన ప్రస్తుత జీవనశైలి కారణంగా మెదడు నిరంతరం ఒత్తిడికి లోనవుతుంది. అయితే మనం రోజు ఒక గుడ్డు తినడం వల్ల గుడ్డులోని పచ్చసొనలోని లుటిన్, జియాక్సంతిన్ యాంటీఆక్సిడెంట్లుగా మనకు లభిస్తాయి. ఇవి మెదడు వాపు, ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే ఎగ్స్‌లో ఉండే బి-విటమిన్లు, ఒమేగా-3లు కొవ్వులు మన మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడతాయి.

మీరు రోజుకు ఎన్ని గుడ్లు, ఎలా తినాలి: ఒక వ్యక్తి వారానికి 3 నుండి 7 గుడ్లు సులభంగా తినవచ్చు. గుడ్లు తినేటప్పుడు, పచ్చసొనను అస్సలు పక్కన పెట్టొద్దు మొత్తం గుడ్డు తినడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది

అలాగే గుడ్లను ఎలా తినాలో కూడా తెలుసుకోవడం ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండేందుకు పచ్చి గుడ్లు తీసుకోకుండా, ఉడికించినా, ఆమ్లెట్లు లేదా గుడ్డు బుర్జీలు వంటి ఆహారంలో చేర్చుకోండి.




