- Telugu News Photo Gallery Eat Raw Veggies for Better Health: Unlock Nutrient Power of Uncooked Produce
Raw Vegetables: వీటిని ఉడికించి కాదు.. పచ్చిగా తింటేనే ఎక్కవ ప్రయోజనాలు.. ఆవేంటంటే?
Raw Vegetables Benefits: మనం ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలు ఎంతగానో ఉపయోగపడుతాయి. వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. కూరగాయలను ఉడికించి తినడం వల్ల వాటిలోని హానికరమైన పదార్థాలు నాశనమైన.. మనకు తినడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే త్వరగా జీర్ణం అవుతాయి. కానీ కొన్ని కూరగాయలను ఉడికించి తినడం కన్నా.. పచ్చిగా తింటేనే వాటి ప్రయోజనాలను ఎక్కువగా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ కూరగాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
Updated on: Dec 13, 2025 | 10:52 AM

రెడ్ బెల్ పెప్పర్: ఈ బెల్ పెప్పర్‌ను పోషకాహార పవర్ హౌస్ అని అంటారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాన్ని దీన్ని ఉండికించడం, లేదా వండడం ద్వారా దానిలోని విటమిన్ సి శాతం తగ్గుతుంది. కాబట్టి దీన్ని పచ్చిగా తినడం వల్ల దానిలోని విటమిన్ సి మనకు పుష్కలంగా లభిస్తుంది.

బ్రోకలీ: బ్రోకలీలో గ్లూకోరాఫనిన్ ఉంటుంది, ఇది దాని శోథ నిరోధక, కీమోప్రొటెక్టివ్ ప్రభావాల కోసం అధ్యయనం చేయబడిన సమ్మేళనం. ఇది సల్ఫోరాఫేన్‌గా మారడానికి మైరోసినేస్ అనే ఎంజైమ్ అవసరం, ఇది పచ్చి బ్రోకలీలో ఉంటుంది. కానీ దీన్ని ఉడికించడం ద్వారా అది తొలగిపోతుంది. కాబట్టి దీన్ని పచ్చిగా తినడమే ఉత్తమం.

వెల్లుల్లి: పచ్చి వెల్లుల్లిని గ్రైండ్ చేసినప్పుడు లేదా తరిగినప్పుడు, అందులో ఉండే అల్లినేస్ అనే ఎంజైమ్ దానిని అల్లిసిన్‌గా మారుస్తుంది, ఇది యాంటీమైక్రోబయల్, హృదయనాళ ప్రభావాలతో సంబంధం ఉన్న సమ్మేళనం. కాబట్టి దీన్ని పచ్చిగా తినడం ప్రయోజకరంగా ఉంటుంది. దీన్ని నేరుగా తినడం కొంచె కష్టమైనప్పటికీ.. దానిని తేనెతో తీసుకోవడం ఉత్తమం. అయితే కొన్ని దీన్ని పచ్చిగా తింటే కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిని తీసుకునే ముందు నిపుణుడిని సంప్రదించండి.

ఉల్లిపాయ: ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్, సల్ఫర్ కలిగిన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, హృదయ సంబంధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలను ఎక్కువగా ఉడికించడం వల్ల ఈ సమ్మేళనాలు తొలగిపోవచ్చు. అలాగే వీటిని ఉడికించడం ద్వారా వీటిలో ఉండే కొన్ని ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ సమ్మేళనాలు తగ్గుతాయని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. కాబట్టి కొన్ని సార్లు వీటిని పచ్చిగా తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

వాటర్‌క్రెస్: వాటర్‌క్రెస్ ఇలాంటి సలాడ్ ఆకుకూరల్లో విటమిన్ సి అధికంగా ఉంటాయి. దాంతో పాటు వాటిలో వేడిని తగ్గించే ఫైటోకెమికల్స్ ఉంటాయి. వాటిని ఎక్కువసేపు ఉడికించడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి, ఫైటోకెమికల్ క్వాంటిటీ తగ్గుతుంది, కాబట్టి వాటిని సలాడ్‌లు, స్మూతీలు లేదా డ్రెస్సింగ్‌గా పచ్చిగా తినడం వల్ల మీరు ఎక్కువ పోషక విలువలను పొందవచ్చు.




