AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Side Effects: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా..? ఓర్నాయనో.. ఈ సమస్యలు తప్పవంట..

సీ విటమిన్ పుష్కలంగా ఉన్న నిమ్మరసం ఎక్కువగా తాగడం మన శరీరానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మంచికి బదులు శరీరానికి హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలేంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..

Lemon Side Effects: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా..? ఓర్నాయనో.. ఈ సమస్యలు తప్పవంట..
Lemon Water Side Effects
Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2025 | 3:42 PM

Share

సీ విటమిన్ పుష్కలంగా ఉన్న నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి.. ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే కొన్ని రోజుల్లోనే బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు నిమ్మరసం జీర్ణక్రియ సులభతరం చేస్తుంది.. అంతేకాకుండా.. కడుపునకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. నిమ్మరసంలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి – గుండె, కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయినప్పటికీ, ఏదైనా అధికంగా ఉపయోగించడం హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం ఎక్కువగా తాగడం మన శరీరానికి అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవడం లాభాలకు బదులు.. అనర్థాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు..

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు..

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో పోషకాల స్థాయి పెరిగితే.. అది చాలా ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. కావున దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎసిడిటీ – కడుపు నొప్పి: విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల స్రావం పెరుగుతుంది. ఎసిడిటీ ప్రమాదాన్ని పెంచడంతోపాటు.. ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌తో బాధపడేవారు తక్కువగా నిమ్మరసం తీసుకోవాలి..

నోటిలో బొబ్బలు: నిమ్మకాయ నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలిగించి.. దంతాలను శుభ్రపరుస్తుంది.. అయితే నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగితే అందులోని.. సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలాలలో వాపును కలిగిస్తుంది. దీని కారణంగా నోటిలో పొక్కులు, బొబ్బలతోపాటు అసౌకర్యం కలిగిస్తుంది.

దంతాలు బలహీనంగా మారుతాయి: నిమ్మరసంలోని ఆమ్లాలు దంత సమస్యలను పెంచుతాయి. అంతేకాకుండా దంతాలు బలహీనంగా మారేలా చేస్తాయి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..