Climbing Stairs Benefits: మెట్లు ఎక్కి దిగితే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే లిఫ్ట్ అస్సలు వాడరు..
నేటి వేగవంతమైన జీవితంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాలుగా మారింది. ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, బరువు పెరగడం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోంది. నేడు దాదాపు ప్రతి రెండవ వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం. అందువల్ల, చాలా మంది జిమ్‌లలో చేరుతున్నారు.. ఇది శరీరాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. కానీ, దీనికి చాలా డబ్బు కూడా ఖర్చవుతుంది. దీనితో పాటు వివిధ ఆహారపు అలవాట్లను పాటిస్తారు. ప్రత్యేక వ్యాయామాలు కూడా చేస్తుంటారు.. కానీ, మీ ఇంట్లోని మెట్లు వీటన్నింటినీ వదిలించుకోవడానికి మీకు సహాయపడతాయని మీకు తెలుసా? అవును, ప్రతి ఇంట్లో మెట్లు ఉంటాయి. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.. ఇకపై లిఫ్ట్ అసలే ఉపయోగించారు..

మెట్లు ఎక్కడం శరీరానికి అద్భుతమైన ఆరోగ్యం ప్రయోజనాలను అందిస్తుంది. శరీర బలం పెంచడం, కొవ్వు తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణ నడక లేదా జాగింగ్ చేయడం కంటే మెట్లు ఎక్కడం శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎక్కువ మందికి అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేవి ప్రధాన సమస్యలు. మెట్లు ఎక్కడం ఒక సులభమైన పరిష్కారంగా మారింది.
6నిమిషాల పాటు నిరంతరం మెట్లు ఎక్కితే శరీరంలోని మొత్తం కొవ్వు సుమారు 15 శాతం వరకు తగ్గించవచ్చు. ప్రత్యేకమైన వ్యాయామ పద్ధతులు అవసరం లేకుండా మెట్లు ఎక్కడం ద్వారా కూడా కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడానికి మెట్లు ఎక్కడం అనేది అధిక తీవ్రత కలిగిన వ్యాయామం. ఇది తక్కువ సమయంలోనే చాలా కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది మీ కండరాలను టోన్ చేస్తుంది. మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
30 నిమిషాలు మెట్లు ఎక్కడం వల్ల 250-300 కేలరీలు ఖర్చవుతాయి. ఈ వ్యాయామం కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ కాళ్ళు, పిరుదులు, క్వాడ్లు, దూడ కండరాలను బలపరుస్తుంది. ఇది కార్డియో, బల శిక్షణ రెండింటి యొక్క గొప్ప కలయిక. నేటి బిజీ జీవితంలో మనం సరైన శారీరక వ్యాయామానికి సమయం కేటాయించలేకపోవచ్చు. రోజువారీ పనుల్లో మెట్లు ఎక్కడాన్ని ప్రాధాన్యం ఇవ్వడం వల్ల శరీరానికి మంచి లాభాలు పొందవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








