అన్నమయ్య జిల్లా వై.కోట క్రాస్ రోడ్డు వద్ద వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి కూల్ డ్రింక్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షాపుతో పాటు ఓ ఆటో, ఫ్రిడ్జ్, కూల్ డ్రింక్స్, తినుబండారాలు ధ్వంసమయ్యాయి. పక్కనే నిద్రిస్తున్న వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు.