Akhanda 2 Movie: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో అఖండ 2 చిత్రం విడుదల సందర్భంగా అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలయ్య వీరాభిమాని దిండి సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 15 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావు ప్రత్యేక పూజలు చేసి తొలి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ వేడుక బాలయ్య అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.