14 December 2025

చాణక్య నీతి : ఈ లక్షణాలు ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల వద్ద అప్పు తీసుకుంటారు !

samatha

Pic credit - Instagram

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. తత్వవేత్త, అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఈయన తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి,  దాని ద్వారా ఆయన ఈ తరం వారికి ఎన్నో విషయాలను తెలియజేశాడు. ముఖ్యంగా డబ్బు, సంపాదన గురించి కూడా చాలా గొప్పగా తెలియజేశాడు.

కాగా, ఇప్పుడు మనం  అసలు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎవరిపై ఎక్కువగా ఉండదు. ఎవరు ఎప్పుడూ ఇతరుల వద్ద చేయి చాచి, డబ్బు అప్పు తీసుకుంటారో కూడా తెలియజేశారు.

ఆచార్య చాణక్యుడి ప్రకారం, అవసరం లేకపోయినా డబ్బును ఖర్చు చేసే వారి ఇంటి లోపల లక్ష్మీదేవి ఉండదంట. ఎప్పుడూ ఖర్చు చేసేవారు, నిరంతరం ఇతరులను అప్పులు అడుగుతూనే ఉంటారు.

ఏ వ్యక్తి అయితే అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తాడో, అది ఎక్కువ రోజులు ఉండదు. అది కూడా ఏదో ఒక రోజు వినాశనానికి కారణం అవుతుందని చెబుతున్నాడు చాణక్యుడు.

ఎవరి వద్దనైతే తమకు డబ్బు ఉందని, ఇష్టానికి ఖర్చు చేస్తూ, గర్వం చూపిస్తారో వారి ఇంటి ధనం ఎక్కువ రోజులు ఉండదు.

ఏ ఇంట్లో అయితే అశాంతి , కలహాలు, అవమానం ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదు, ముఖ్యంగా ఆ ఇంటి వారు ఎప్పుడూ అప్పుల ఊబిలో చిక్కుకొని ఉంటారు.

అలాగే ఏ వ్యక్తి అయితే తమ ఇంటిలోని ధనం చూసి మురిసిపోతాడో, వేరేవారిని అవమానిస్తాడో, వారి ఇంట్లో ధనం ఎక్కువ రోజులు నిలవదంటున్నారు ఆ చార్య చాణక్యుడు.