- Telugu News Photo Gallery Spiritual photos To get rid of Vastu defects, these are the remedies to be followed on Tuesdays and Saturdays
మంగళ వారం, శని వారం ఇలా చేస్తే.. వాస్తు దోషం పరార్ అవ్వాల్సిందే!
వాస్తు అనేది చాలా పవర్ ఫుల్. అందుకే వాస్తు శాస్త్రాన్ని అస్సలే విస్మరించకూడదు అని చెబుతుంటారు. ఏ విషయంలోనైనా సరే ఎవరైతే సరిగ్గా వాస్తు నియమాలు పాటించరో, వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తప్ప కుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు.
Updated on: Dec 13, 2025 | 4:36 PM

వాస్తు అనేది చాలా పవర్ ఫుల్. అందుకే వాస్తు శాస్త్రాన్ని అస్సలే విస్మరించకూడదు అని చెబుతుంటారు. ఏ విషయంలోనైనా సరే ఎవరైతే సరిగ్గా వాస్తు నియమాలు పాటించరో, వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తప్ప కుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు.

అయితే కొంత మంది ఇంటిలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే దీనికి ముఖ్య కారణం వాస్తు. వాస్తు దోషం ఉన్నవారి ఇంటిలోనే ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయంట.

మరి మీ ఇల్లు వాస్తు దోషం వలన ప్రభావితం అవుతుందా? లేదో తెలుసుకోవాలి అంటే? తప్పకుండా కొన్ని సూచనలు తెలుసుకోవాలి అట. రోజూ చిన్న చిన్న సమస్యలు, కుటుంబంలో విభేదాలు, తరచూ కుటుంబంలో ఎవర ఒక వ్యక్తికి అనారోగ్యం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి సమస్యలు, ఏ కారణం లేకుండా మొక్కలు ఎండిపోయినా, అది వాస్తు దోషమే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అయితే అలా ఇంటిలో ఉన్న వాస్తు దోషాన్ని తరిమికొట్టడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయంట. వాటిని ప్రతి శని వారం లేదా మంగళవారాలు పాటించడం వలన వాస్తు దోషం తొలిగిపోతుందంట. వాస్తు దోషం ఉన్నవారు, ప్రతి మంగళ వారం, శని వారం ధూపం వెలిగించి, ఆ సువాసన ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయాలంట. దీని వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

అదే విధంగా ప్రతి రోజూ తప్పకుండా శివుడిని పూజించాలంట. ఎవరైతే ప్రతి రోజూ క్రమం తప్పకుండా శివుడిని పూజిస్తారో, వారి ఇంటిలో వాస్తు దోషం తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట. అలాగే నిత్యం దీపారాధన తప్పకుండా చేయాలంట.



