- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: The direction in your home affects your health
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో ఒత్తిడి, అనారోగ్య సమస్యలేనా..కారణం ఇదేనేమో!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే 2026వ సంవత్సరంలో నాలుగు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ధన లాభం కలగబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.
Updated on: Dec 13, 2025 | 4:48 PM

వాస్తు శాస్త్రంలో ప్రధాన ద్వారానికి ఉండే ప్రాముఖ్యతనే వేరు. ఇది మీ ఇంటికి వచ్చే శక్తి మార్గం. అందుకే ఇది ఎప్పుడూ సరైన మార్గంలో ఉండాలని చెబుతారు నిపుణులు. మీ ప్రధాన ద్వారం తూర్పు దశలో తెరుచుకుంటే, ఇది మీ ఇంటిలో సంపదను ఆకర్షిస్తుంది. ఒక వేళ మీకు పడమర లేదా దక్షిణంవైపు తలుపులు ఉంటే తప్పకుండా వాస్తు చూసుకోవాలి.

మీ ఇంటిలో ఏదైనా సరిగ్గా లేనప్పుడు దానిని పసిగట్టడానికి మీకు బ్లూ ప్రింట్లు అవసరం లేదు,దిక్సూచితో మీరు దానిని తెలుసుకోవచ్చును. ఒక వేళ మీకు ఇల్లు తప్పుడు దిశలో ఉందని తెలిసినా అలాగే ఉండటం వలన మీ ఇంటిలో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తరచూ ఉంటాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అయితే ఇలాంటి సమయంలో వాస్తు దోషాలను తరిమికొట్టడానికి తప్పకుండా కొన్ని వాస్తు పరిహారాలు పాటిచాలంట. అవి ఏవి అంటే? వాస్తు ప్రకారం మీ ఇల్లు లేకపోయినా చింతించాల్సిన అవసరం లేదంట, మీరు మీ ఇంటిలో సరైనప్రదేశాల్లో అద్దాలు లేదా స్పటికాలను ఉంచడం వలన ప్రతికూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

అదే విధంగా ఈశాన్యం లేదా తూర్పున కొన్ని పచ్చటి మొక్కలు నాటడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. అలాగే ఫర్నీచర్ విషయంలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. డెస్క్, మంచం, టేబుల్స్ మార్చడం వలన కూడా వాస్తు దోషం పోతుంది.

అదే విధంగా చీకటిగా ఉండే ప్రదేశాలను వెలుగుతో నింపడానికి, తప్పకుండా మంచి రంగులను ఉపయోగించాలంట. అలాగే, చిహ్నాలు లేదా యంత్రాలను ఇంటిలో ఆచారాలకు అనుగుణంగా అమర్చుకోవడం వలన కూడా కలిసి వస్తుందంట.



