Suman Shetty: ‘ఆ నటుడు షూటింగ్‌లో అలా అనగానే మనసు చివుక్కుమంది’
ప్రముఖ కమెడియన్, ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సుమన్ సెట్టి అప్పట్లో తన సినీ జీవితం, ఆర్టిస్ట్ కృష్ణ భగవాన్‌తో గొడవకు గల కారణం.. ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్ ప్రారంభంలో ఎలాంటి సినిమా ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పారు. కానీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ భగవాన్ తో చిన్న వివాదం జరిగిందని చెప్పారు.

ప్రముఖ తెలుగు హాస్యనటుడు సుమన్ శెట్టి తన సినీ జీవితం, వివాదాలు, కృష్ణ భగవాన్‌తో గొడవ గురించి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కెరీర్ ప్రారంభం నుంచి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని.. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండేవాడినని వెల్లడించాడు. నెలలో 30 రోజులు షూటింగ్‌లు ఉండేవని.. కాలక్రమేణ అవకాశాలు తగ్గినట్లు చెప్పారు. సుమన్ శెట్టి తన వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడాడు. అతను తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని.. బయటకు తక్కువగా వెళతానని తెలిపాడు. తన మీద వచ్చిన గాసిప్పుల గురించి కూడా సరదాగా మాట్లాడాడు. కొన్ని అఫైర్లకు సంబంధించిన వార్తలు వచ్చాయని వ్యాఖ్యత ప్రశ్నించగా.. అబ్బా నిజమా అవేంటో నేను కూడా చదువుకుంటానని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.
సహనటుడు కృష్ణ భగవాన్ మధ్య జరిగిన వివాదం గురించి ఆయన మనసు విప్పి మాట్లాడారు. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమా షూటింగ్ సమయంలో ఒక లెంగ్తీ డైలాగ్ షూట్ చేయడంలో సుమన్ కొంత ఇబ్బంది పడ్డారట. డైలాగ్ ప్రొనన్సియేషన్ సరిగ్గా చెప్పలేక ఎక్కువ టేక్స్ తీసుకున్నాడట. దీంతో కృష్ణ భగవాన్‌కి.. సుమన్ శెట్టి మీద చిరాకు పడ్డారట. అప్పుడు కాస్త బాద అనిపించిందని.. ఆ సమయంలో ఇండస్ట్రీకి కొత్త అని.. అందుకే ఇబ్బంది పడినట్లు తెలిపాడు. పెద్ద ఆర్టిస్టులు కొత్త వాళ్లను కాస్త ఎంకరేజ్ చేస్తే బాగుంటందని వ్యాఖ్యానించారు. కృష్ణ భగవాన్ లెగ్ ప్రాబ్లం వల్ల అలా అన్నారని.. ఆ తర్వాాత కాలంలో తనకు విషయం తెలిసినట్లు సుమన్ శెట్టి వెల్లడించాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




