Allu Arjun – Atlee: ఎన్నాళ్లకు ఈ హిట్ జోడి రిపీట్.. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్..?
పుష్ప 2 సినిమాతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్ తర్వాత బన్నీ నటించబోయే సినిమాపై మరింత హైప్ పెరిగింది. అల్లు అర్జున్ తర్వాత సినిమా ఎవరితో చేయనున్నాడనే క్యూరియాసిటీ ఎక్కువగా నెలకొంది.

పుష్ప 2 సినిమాతో సంచలన విజయం సాధించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన బన్నీ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన నెక్ట్స్ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ తన కొత్త సినిమాను చేయనున్నాడు. ఈ విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. డైరెక్టర్ అట్లీ 2013లో విడుదలైన రాజా రాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో టాప్ డైరెక్టలలో చోటు సంపాదించుకున్నారు.
ఇప్పటివరకు అట్లీ తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవలే హిందీలో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అట్లీ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం AA 22 X A6 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ఉంటుందని ఒక్క వీడియోతో తెలియజేశారు మేకర్స్.
ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందని ఇన్నాళ్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో సమంత కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత సామ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అంతేకాదు.. దాదాపు 9 ఏళ్ల తర్వాత మరోసారి అల్లు అర్జున్ సరసన కనిపించనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి బన్నీతో సామ్ జతకట్టనుందనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




