Tollywood: అండర్ వరల్డ్ డాన్‌తో ప్రేమ.. జైలుకు వెళ్లిన హీరోయిన్.. దెబ్బకు కెరీర్ నాశనం.. ఇప్పుడేం చేస్తుందంటే..
సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లతో సినిమాలకు దూరమై.. కెరీర్ పూర్తిగా నాశనం చేసుకున్న హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ అయ్యింది. సినీరంగుల ప్రపంచంలో ఆమె పేరు వివాదాస్పదమైంది. ఆమె తీసుకున్న ఒక తప్పు నిర్ణయం ఈ బ్యూటీ కెరీర్ మొత్తాన్ని.. అలాగే జీవితాన్ని నాశనం చేసింది. అండర్ వరల్డ్ డాన్‌తో ప్రేమలో పడి చివరకు జైలుకు వెళ్లొచ్చింది. చివరకు సినిమా ఆఫర్స్ రాకపోవడంతో నటిగా కెరీర్ పూర్తిగా నాశనమైంది. ఆమె మరెవరో కాదు.. మోనికా బేడి. పంజాబ్‌లో జన్మించి, చిన్నతనంలోనే ఆమె కుటుంబం నార్వేకు వలస వెళ్లింది. 1995లో ‘తాజ్ మహల్’ అనే హిందీ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 90’sలో సురక్ష, జనమ్ సజా కరో, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, ఝంజర్, జోడి నంబర్ 1 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. హిందీతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ సరసన తాజ్ మహల్ చిత్రంలో నటించింది. ఈ మూవీతో తెలుగులో చాలా పాపులర్ అయ్యింది.
ఆ తర్వాత మోహన్ బాబు నటించిన సొగ్గాడి పెళ్లాం అనే సినిమాలో నటించింది. అయితే అప్పట్లోనే పాన్ ఇండియా బ్యూటీగా ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా ఎదిగిన మోనికా.. కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంతో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ఆమెకు ఆఫర్స్ కోసం అబూ సలేం కొంతమంది నిర్మాతలు బెదిరించాడని.. అందుకే ఆమెకు ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయనే ప్రచారం నడించింది. 2002లో వీరిద్దరిని నకిలీ పాస్ పోర్ట్ కేసులో పోర్చుగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత భారత్ వచ్చిన వీరిద్దరిని విచారించిన తర్వాత రెండేళ్లు జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తెరపైకి తిరిగి వచ్చింది.
సంజయ్ లీలా భన్సాలీ సీరియల్ ‘సరస్వతీచంద్ర’లో ఆమె నెగటివ్ రోల్ పోషించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. కానీ సినీరంగంలో మాత్రం ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోనికా బేడి అంతగా యాక్టివ్ గా లేదు. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో కనిపిస్తుంది. ఇటీవల కొన్ని రోజులుగా ఆధ్యాత్మికత, యోగా, మానసిక ప్రశంతత గురించి పోస్టులు చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




