AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వరుసగా డిజాస్టర్స్.. మరో ప్రయోగానికి సిద్ధమైన స్టార్ హీరో.. ఊహించని గెటప్‏లో..

కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ అందుకుంటూ సతమతమవుతున్నాడు ఆ స్టార్ హీరో. అయినప్పటికీ రెగ్యులర్ స్టోరీస్ ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. విభిన్నమైన కంటెంట్ సినిమాతో ఊహించని పాత్రలో కనిపించేందుకు రెడీ అయ్యారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?

Tollywood: వరుసగా డిజాస్టర్స్.. మరో ప్రయోగానికి సిద్ధమైన స్టార్ హీరో.. ఊహించని గెటప్‏లో..
Akshay Kumar
Rajitha Chanti
|

Updated on: Apr 09, 2025 | 2:03 PM

Share

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో అతడు ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో థియేటర్లలలో సందడి చేస్తున్నారు. కానీ ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. కొన్నాళ్లుగా డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ సరైన బ్రేక్ రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఊహించని గెటప్‏లో కనిపించి ఫ్యాన్స్ కు షాకిచ్చారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ హీరోను గుర్తుపట్టారా..? కొన్నాళ్లుగా హిందీ చిత్రపరిశ్రమలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతడు మరెవరో కాదండి.. బీటౌన్ స్టార్ అక్షయ్ కుమార్. ప్రస్తుతం కేసరి 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు కథకళి గెటప్ లో ఉన్న ఓ పోస్టర్ పంచుకున్నారు.

ఈ సినిమాలో జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత న్యాయం కోసం పోరాడిన వ్యక్తి సి శంకరన్ నాయర్ పాత్రను ఆయన పోషించనున్నారు. “ఇది దుస్తులు కాదు. ఇది సంప్రదాయానికి, ప్రతిఘటనకు, సత్యానికి, నా దేశానికి చిహ్నం” అనే క్యాప్షన్‌తో తన ఇన్ స్టాలో ఈ ఫోటో షేర్ చేశారు అక్షయ్ కుమార్. “సి శంకరన్ నాయర్ ఆయుధంతో పోరాడలేదు. అతను బ్రిటిష్ సామ్రాజ్యంతో చట్టంతో, తన ఆత్మలో అగ్నితో పోరాడాడు. ఈ ఏప్రిల్ 18న పాఠ్య పుస్తకాలలో ఎప్పుడూ బోధించని ఓ వీరుడి కథను మీ ముందుకు తీసుకువస్తున్నాము ” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

భారతదేశంలో అత్యంత కీలకమైన న్యాయ పోరాటాలలో ఒకటైన కథను వెండితెరపైకి తీసుకువస్తున్నారు అక్షయ్ కుమార్. ఏప్రిల్ 3న విడుదలైన కేసరి 2 సినిమా ట్రైలర్ మూవీపై మరింత అంచనాలు పెంచేసింది. నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం, జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత జరిగిన పరిణామాలను, భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ నేతృత్వంలోని న్యాయం కోసం జరిగిన పోరాటాన్ని తెలియజేస్తుంది.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?