Allu Arjun: అల్లు అర్జున్ ప్రేయసిగా, భార్యగా నటించి.. ఇప్పుడు బన్నీ సినిమాలో విలన్గా ఆ స్టార్ హీరోయిన్..
పుష్ప 1, 2 చిత్రాలతో వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. దీంతో ఇప్పుడు ఈ హీరో చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయనున్నారు బన్నీ. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెరిగాయి. కానీ ఈ సినిమాకు సంబంధించి నిత్యం ఏదోక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. గంగోత్రి సినిమాతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ ఇమేజ్ చేసుకునేలా చేసింది. దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తనదైన ముద్ర వేశారు బన్నీ. ఇక డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారారు. ఇందులో తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు బన్నీ చేయబోయే తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో బన్నీ జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సైతం కనిపించనుందట. అలాగే జాన్వీ కపూర్, భాగ్య శ్రీ భోర్సే, అలియా వంటి పేర్లు వినిపిస్తున్నారు. అయితే ఈ హీరోయిన్స్ అందరూ కీలకపాత్రలలో మాత్రమే కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ప్రాజెక్టులో రష్మిక పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇదివరకు రష్మిక, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీకి ప్రేయసిగా, భార్యగా కనిపించింది రష్మిక, ఇప్పుడు అట్లీ రూపొందిస్తున్న ప్రాజెక్టులో ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో కనిపించనుందనే సమాచారం. ఆమెతో యాక్షన్ సీక్వెన్స్ సైతం ఉంటాయని అంటున్నారు. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని 2027లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారని అంటున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








