AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్యాద రామన్న 2 ట్రైలర్ వచ్చింది చూసారా.. ఎలా ఉందో తెలుసా..?

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన సినిమా మర్యాద రామన్న. ఎప్పుడూ సూపర్ స్టార్స్ తో సినిమాలు తీసే జక్కన్న.. మొదటిసారి సునీల్ తో విభిన్న ప్రయత్నం చేశారు. ఇక ఇదే సినిమాను హిందీలో సన్నాఫ్ సర్దార్ అనే టైటిల్ తో తీశారు. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ తీసుకువస్తున్నారు.

మర్యాద రామన్న 2 ట్రైలర్ వచ్చింది చూసారా.. ఎలా ఉందో తెలుసా..?
Son Of Sardaar 2 Trailer
Praveen Vadla
| Edited By: |

Updated on: Jul 11, 2025 | 5:06 PM

Share

మర్యాద రామన్న 2 ట్రైలరా..? అదెప్పుడు వచ్చింది..? అసలు రాజమౌళి ఎప్పుడు ఆ సినిమా తీసాడు అనుకుంటున్నారు కదా..? అదేం లేదు.. మన సినిమాలు హిందీలో రీమేక్ అవుతుంటాయి కదా.. అలా మర్యాద రామన్న సినిమాను హిందీలో సన్నాఫ్ సర్దార్ పేరుతో రీమేక్ చేసారు. 2012లో అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అదే సినిమాకు సీక్వెల్ చేసారిప్పుడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మన దగ్గర మర్యాద రామన్న కథను తీసుకుని.. ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్‌తో మరో సినిమా తీస్తున్నారు అజయ్ దేవ్‌గన్ అండ్ బ్యాచ్. అయినా రాజమౌళి తీసిన విజువల్ గ్రాండియర్స్, కమర్షియల్ సినిమాలతో పోలిస్తే మర్యాద రామన్న కాస్త తక్కువగా కనిపిస్తుందేమో గానీ.. అప్పట్లో ఆ సినిమా తీసుకొచ్చిన లాభాలు మాత్రం తక్కువేం కావు.

సునీల్‌ను హీరోగా పెట్టి స్టార్ హీరోల సినిమాలకు కూడా రాని వసూళ్లు రాబట్టాడు రాజమౌళి. 2010లో విడుదలైన మర్యాద రామన్న ఆ రోజుల్లోనే 26 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే సినిమాను అన్ని భాషల్లో రీమేక్ చేసారు. అలాగే హిందీకి కూడా వెళ్లింది. సన్నాఫ్ సర్దార్ 2 ట్రైలర్ చూస్తుంటే.. సేమ్ టూ సేమ్ హీరోను మరో ఇంటికి తీసుకొచ్చి.. అతడికి ఓ సమస్యను అంటగట్టి.. అక్కడ్నుంచి ఎలా బయట పడ్డాడు అనే కథను రాసుకున్నట్లు అర్థమవుతుంది. జూలై 25న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. పంజాబ్ ఫ్యాక్షనిస్టుల కుటుంబం నుంచి తప్పించుకున్న సర్దార్.. స్కాట్‌ల్యాండ్ వెళ్లి అక్కడ ఇంకో ఫ్యామిలీలో చిక్కుకుంటాడు. ఊహించని విధంగా ఆర్మీ ఆఫీసర్ అవతారం ఎత్తుతాడు. అక్కడ్నుంచి ఏమవుతుంది అనేది అసలు కథ.. రెండో భాగానికి దర్శకుడు మారాడు.

సన్నాఫ్ సర్దార్ 2లో హీరోయిన్‌ కూడా మారిపోయింది. అప్పుడు సోనాక్షి సిన్హా నటిస్తే.. ఇప్పుడు ఆ స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. మన దగ్గర మర్యాద రామన్న సీక్వెల్ ఐడియా వర్కవుట్ కాదని చెప్పాడు రాజమౌళి. కానీ హిందీలో మాత్రం వాళ్లు ఆ క్యారెక్టర్ తీసుకుని కథలు రాస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత అజయ్ దేవగన్ కంప్లీట్ కామెడీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే జోకులు బాగానే పేలాయి. మొత్తానికి చూడాలిక.. ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు అలరిస్తుందో..?

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..