పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్.. ఇండియన్ సినిమాను షేక్ చేసే డైరెక్టర్‌తో సినిమాకు గ్రీన్‌సిగ్నల్
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఆ హీరో.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ మాస్ సినిమాల జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు.

గద్దలకొండ గణేష్‌గా గర్జిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించాడు. అయితే గత కొద్ది కాలంగా కాలం కలిసి రావడం లేదు. చేసిన ప్రయోగాలు కాస్తా బెడిసికొట్టడంతో వరుస పరాజయాలు ఆయన కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. మార్కెట్ కూడా కొంత మేర తగ్గిన తరుణంలో.. ఇప్పుడు ఆయన ఒక భారీ వ్యూహం పన్నాడు. భారతీయ సినీ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తూ, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఒక అగ్ర దర్శకుడు ఈ మెగా హీరో కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారనే వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్‌లో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరు? ఆయనను డైరెక్ట్ చేయబోతున్న ఆ స్టార్ దర్శకుడు ఎవరు?
క్రేజీ కాంబో..
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన దశలో ఉంది. ‘ముకుంద’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ‘ఫిదా’ వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్న ఈ హీరో.. తాజాగా కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీతో కలిసి సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ తీసి వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన అట్లీ.. ఇప్పుడు వరుణ్ తేజ్ కోసం ఒక పవర్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ కథను సిద్ధం చేశారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ కాంబినేషన్ వార్త విన్న అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
అట్లీ అంటేనే బాక్సాఫీస్ వద్ద హిట్ గ్యారంటీ. తమిళంలో ‘మెర్సల్’, ‘బిగిల్’, ‘తేరి’ వంటి హిట్లతో అగ్ర దర్శకుడిగా ఎదిగిన ఆయన.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే వరుణ్ తేజ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. వరుణ్ తేజ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అట్లీ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశారట. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ గేమ్‌చేంజర్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.
సరికొత్త అవతారం..
ప్రస్తుతం వరుణ్ తేజ్ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కొరియా నేపథ్యంతో రూపొందుతున్న తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొరియన్ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్, థమన్ అందించిన పవర్ ఫుల్ మ్యూజిక్, వరుణ్ తేజ్ వైలెంట్ లుక్ చూస్తుంటే మెగా ప్రిన్స్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమనిపిస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా డార్క్ షేడ్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ తో ఉండబోతోందట.
వరుస పరాజయాల తర్వాత వరుణ్ తేజ్ ఇప్పుడు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ‘కొరియన్ కనకరాజు’ ఒక గొప్ప ఊరటనిస్తుందని మెగా అభిమానులు విశ్వసిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మాస్ హిట్ పడితే వరుణ్ తేజ్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. అట్లీ వంటి స్టార్ దర్శకుడితో సినిమా చేయాలంటే ముందుగా ఒక సక్సెస్ ఉండటం చాలా అవసరం. అందుకే వరుణ్ తేజ్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని ‘కొరియన్ కనకరాజు’ పైనే పెట్టారు. వరుణ్ తేజ్ ప్రయోగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఇప్పుడు అట్లీ వంటి మాస్ దర్శకుడు తోడైతే మెగా ప్రిన్స్ రేంజ్ మారిపోవడం ఖాయమని భావిస్తున్నారు మెగా అభిమానులు.
