Funky Trailer: అన్న మల్లోచ్చిండురోయ్.. అనుదీప్ మార్క్ కామెడీ.. పంచులు వేరేలెవల్.. ఫంకీ ట్రైలర్ చూశారా.. ?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అదే అంశంపై చిత్రాలు తెరకెక్కిస్తూ సక్సెస్ అవుతున్నారు డైరెక్టర్స్. కొన్నాళ్ల క్రితం జాతిరత్నాలు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ అనుదీప్ కెవి. థియేటర్లలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ అనుదీప్ కెవి చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అంతేకాదు ఆయనకు సైతం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్ల క్రితం జాతిరత్నాలు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతక్కుపోతుంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మూవీ తర్వాత ప్రిన్స్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు అనుదీప్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఫంకీ మూవీ చేశాడు. ఇందులో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా.. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని వాలెంటైన్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఫంకీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..
ట్రైలర్ ప్రారంభం నుంచే తనదైన మార్క్ కామెడీ చూపించాడు అనుదీప్. పంచులతో, కామెడీతో ట్రైలర్ మొత్తం అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన చేయాలంటే నాకు రాదు డాక్టర్ అనే డైలాగ్ నుంచి మొదలుకుని.. ఓనర్ కు రెంటు కట్డుడు వంటివన్నీ నాకు గలీజ్ అనిపిస్తాయ్ అంటాడు హీరో. మీ అమ్మ కోడలు అనడం.. మా నాన్న అల్లుడు అనడం కూడా గలీజ్ అనిపిస్తాయ్ అని హీరోయిన్ చెప్పడం సైతం హైలెట్ అయ్యింది. మొత్తానికి ఈసారి ఫంకీ మూవీ సైతం అనుదీప్ మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..
ఫంకీ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ సినిమాలో అనుదీప్ సైతం అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదల కాబోతుంది.
ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.
ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
