AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెడతావ్: ప్రకాశ్ రాజ్‌పై బండ్ల ఘాటు వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో మరోసారి సోషల్ మీడియా వార్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్రపై ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన సెటైరికల్ పోస్టుకు బండ్ల గణేశ్ ఘాటుగా స్పందించారు. "ప్రతిదాంట్లో వేలు ఎందుకు పెడతావ్?" అంటూ ప్రశ్నించిన బండ్ల, ప్రకాశ్ రాజ్‌పై వరుస విమర్శలు గుప్పించారు.

నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెడతావ్: ప్రకాశ్ రాజ్‌పై బండ్ల ఘాటు వ్యాఖ్యలు
Prakash Raj Vs Bandla Gane
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2026 | 11:32 AM

Share

టాలీవుడ్‌లో కొత్త రచ్చ మొదలైంది. ప్రకాశ్ రాజ్, బండ్ల గణేశ్ మధ్య సోషల్‌మీడియా వార్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ ప్రకాష్‌రాజ్‌ సెటైర్లు వేస్తే.. దానికి వెంటనే బండ్ల గణేశ్ కౌంటర్లు ఇచ్చారు..!

తెలంగాణలో పోటీపై పవన్‌ను ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్‌ Xలో పోస్ట్‌ పెట్టారు. మీరొస్తానంటే మేమొద్దంటామా.. రండి దొర అంటూ కామెంట్‌ చేశారు. ఉత్తుత్తినే వస్తున్నారా.. పొత్తుతో వస్తున్నారా.. లేదంటే.. సింగిల్‌గా వస్తున్నారా చెప్పండి జస్ట్ ఆస్కింగ్‌ అంటూ ప్రకాశ్ రాజ్‌ టార్గెట్ చేశారు.

సెటైరికల్‌గా ప్రకాశ్ రాజ్‌ చేసిన ట్వీట్‌కి వెంటనే బండ్ల గణేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ప్రతిదాంట్లో వేలు ఎందుకు పెడతావ్ అంటూ ప్రకాష్‌రాజ్‌ని ప్రశ్నించారు బండ్ల. అసలు నువ్వెవరు.. నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడవాడివా అంటూ చెలరేగిపోయారు. నీ ఊరేది, నీ కథ ఏంటి, ప్రతి దాంట్లో దూరి జడ్జిమెంట్‌ ఇవ్వడానికి నువ్వేమైనా దేశ ప్రధానివా అంటూ ప్రశ్నించారు. పనిలేకపోతే పని చూసుకోవాలని, ప్రతిదాంట్లో దూరి హీరోలా ఫీల్‌ అవ్వొద్దని వార్నింగ్‌ ఇచ్చారు.

తరచూ వివాదాల్లో ఉండడం ప్రకాశ్ రాజ్‌కి అలవాటే. BJP విషయంలోనూ, సనాతన ధర్మం, హైందవ, ధార్మిక అంశాల్లోనూ ఆయన ఎక్స్‌ వేదికగా ఘాటైన పోస్టులు పెడుతుంటారు. ప్రెస్‌మీట్లలోనూ నిలదీస్తూ ఉంటారు. ఇప్పుడు BJPకి మిత్రుడైన పవన్ కల్యాణ్‌ విషయంలో ఆయన ఘాటైన విమర్శలు చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పవన్ కల్యాణ్‌ హైదరాబాద్‌లో సభ పెట్టాలనుకున్నారు. అందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పవన్ ఆవేశంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పారు. దీన్నే ఇప్పుడు ప్రకాశ్ రాజ్‌ టార్గెట్‌ చేశారు.

Follow Us
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
రెండు యూఏఎన్ నెంబర్లు ఉంటే జరిమానా పడుతుందా..?
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
కబ్జాలు, వివాదాలతో రూ. 100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..