AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చెట్టు బరువుకు కారు దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడటం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించగా, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో చెట్టును తొలగించారు.

Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
Hyderabad Car Incident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 23, 2026 | 10:04 AM

Share

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, సాధారణంగా రాకపోకలు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు విరిగి కారుపై పడింది. చెట్టు బరువుకు కారు ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, కారులో ఉన్న వారు సురక్షితంగా బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని భారీ వృక్షాన్ని తొలగించే పనులు ప్రారంభించారు. ప్రత్యేక పరికరాల సహాయంతో చెట్టు కొమ్మలను కత్తిరించి రహదారిపై నుంచి తొలగించారు. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్టు వేర్లు బలహీనపడటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన సమయంలో రోడ్డుపై ఎక్కువ మంది లేకపోవడం, చెట్టు పడిన సమయంలో కారు నెమ్మదిగా వెళ్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.

వీడియో చూడండి..

ఈ ఘటనతో వివేకానంద నగర్ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన ప్రమాదకర స్థితిలో ఉన్న పాత వృక్షాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులను కోరుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us