Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..
బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన కీసర పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పీజీ మెడికో స్టూడెంట్.. బెంగళూరులో విద్యనభ్యసిస్తోంది.. వారం క్రితమే ఇంటికొచ్చింది.. ఏమైందో ఏమో కానీ.. అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతానికి చెందిన దీక్షిత(26) MBBS పూర్తి చేసి బెంగుళూరులో సిద్ధార్థ కళాశాలలో పీజీ చేస్తోంది. ఈ క్రమంలోనే.. గత వారం బెంగళూరు నుంచి.. నాగారంలోని ఈస్ట్ గాంధీనగర్లో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. శుక్రవారం సాయంత్రం అపార్ట్‌మెంట్ పై నుంచి దూకింది. తీవ్రగాయాలైన దీక్షితను కుటుంబసభ్యులు హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దీక్షిత చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా.. దీక్షిత కుటుంబం సొంతూరు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం, మైలారం గ్రామమని పోలీసులు తెలిపారు. వారు నాగారంలో స్థిరపడినట్లు వెల్లడించారు. దీక్షిత తండ్రి ఆనంద్ కుమార్ ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దీక్షిత ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోని విలువైన ప్రాణాలను కొల్పోవద్దు.. మీకు లేదా మీ మిత్రులకు తీవ్రమైన ఆలోచనలు వస్తే వెంటనే సహాయం కోరండి. మానసిక నిపుణులను లేదా హెల్ప్‌లైన్‌లను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది. లేక స్నేహితులతో మాట్లాడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
