AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Tricks: ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కనిపించకుండా చాట్స్ చదవండి.. ఈ సెట్టింగ్స్ ట్రై చేయండి

వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిన వెంటనే రిప్లై ఇవ్వలేని సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే మెసేజ్ ఓపెన్ చేస్తే ఎదుటివారికి బ్లూ టిక్స్ కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సులభమైన మార్గాలతో మెసేజ్‌లను చదవొచ్చు. వాట్సాప్‌లోని ప్రైవసీ సెట్టింగ్స్, నోటిఫికేషన్ బార్, విడ్జెట్ వంటి ఆప్షన్లు ఇందుకు ఉపయోగపడతాయి. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు.

WhatsApp Tricks: ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కనిపించకుండా చాట్స్ చదవండి.. ఈ సెట్టింగ్స్ ట్రై చేయండి
Whatsapp Secret Reading Hacks.jpg
Nikhil
|

Updated on: Sep 25, 2026 | 9:20 PM

Share

ఎవరైనా మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. కానీ మెసేజ్ చదివిన విషయం మాత్రం వారికి తెలియకూడదనుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు వాట్సాప్‌లో కొన్ని చిన్న మార్పులు ఉపయోగపడతాయి. Read Receipts ఆఫ్ చేయడం నుంచి నోటిఫికేషన్ ప్యానెల్‌లో మెసేజ్ చదవడం వరకు పలు మార్గాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ వాడేవారు విడ్జెట్ సాయంతోనూ చాట్స్ చూడొచ్చు.

బ్లూ టిక్స్ ఉండవు

వాట్సాప్‌లో బ్లూ టిక్స్ కనిపించకుండా ఉండేందుకు Read Receipts ఆఫ్ చేయడం సులభమైన మార్గం. ఇందుకోసం వాట్సాప్ ఓపెన్ చేసి Settingsలోకి వెళ్లాలి. అక్కడ Privacy ఆప్షన్‌ను ఎంచుకుని Read Receiptsను Off చేయాలి. ఈ సెట్టింగ్ తర్వాత మీరు ఇతరుల మెసేజ్‌లు చదివినా వారికి బ్లూ టిక్స్ కనిపించవు. అయితే మీరు పంపిన మెసేజ్‌లను ఇతరులు చదివినా మీకు బ్లూ టిక్స్ కనిపించవు.

ఇంకో మార్గం నోటిఫికేషన్ బార్. ఫోన్‌కు మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ ప్యానెల్‌లో కనిపించే మెసేజ్‌ను అక్కడే చదవొచ్చు. వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఆన్‌లైన్ స్టేటస్ చూపించే అవకాశం తగ్గుతుంది.

Airplane Mode, Widgetతోనూ..

వాట్సాప్‌లోకి వెళ్లి మెసేజ్ చదవాల్సి వస్తే Airplane Mode ఉపయోగించవచ్చు. ముందుగా ఇంటర్నెట్ లేదా వైఫై ఆపి, ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చదివి యాప్‌ను పూర్తిగా క్లోజ్ చేయాలి. Recent Apps నుంచి కూడా తొలగించిన తర్వాత ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేసి ఇంటర్నెట్ ఆన్ చేయాలి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో WhatsApp Widgetను హోమ్ స్క్రీన్‌పై పెట్టుకోవడం మరో మార్గం. హోమ్ స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేసి Widgetsలో WhatsAppను ఎంచుకుని యాడ్ చేయాలి. ఇలా చేస్తే యాప్ ఓపెన్ చేయకుండానే కొత్త మెసేజ్‌లను హోమ్ స్క్రీన్ నుంచే చూడొచ్చు. బిజీగా ఉన్నప్పుడు వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేకుండా మెసేజ్ తెలుసుకోవడానికి ఈ మార్గాలు ఉపయోగపడతాయి. ప్రైవసీ కోసం థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడకుండా వాట్సాప్‌లోని ఆప్షన్లనే ఉపయోగించడం మంచిది.

Follow Us