AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్..! అసలు క్లారిటీ ఇదే.. జాగ్రత్త పడండి..

డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించేవారికి బిగ్ అలర్ట్. గ్యాస్ ఈకేవైసీకి అక్టోబర్ 1 వరకు మాత్రమే సమయం ఉంది. పూర్తిచేయనివారు ఆ తర్వాత గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. దీంతో వినియోగదారులు వెంటనే గ్యాస్ ఈకేవైసీ పూర్తి చేయడం మంచిది.

అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్..! అసలు క్లారిటీ ఇదే.. జాగ్రత్త పడండి..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Sep 25, 2026 | 9:17 PM

Share

ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నవారికి బిగ్ అలర్ట్. గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారు ఆధార్ ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు అక్టోబర్ 1 వరకు మాత్రమే గడువు ఉంది. అప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే గ్యాస్ సబ్సిడీ కట్ అయ్యే అవకాశముంది. అలాగే గ్యాస్ బుకింగ్‌లో కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. గ్యాస్ ఈకేవైసీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేయనివారికి గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదని, సిలిండర్ల సరఫరా కూడా ఆగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్లారిటీ ఇచ్చాయి.

గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోతుందా..?

ఈకేవైసీ పూర్తి చేయనివారికి గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోతుందనే ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టతిచ్చాయి. పెట్రోలియం మంత్రిత్వశాఖ నుంచి అలాంటి ఆదేశాలు ఏమీ రాలేదని చెబుతున్నాయి. ఆధార్ కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోతుందని అంటున్నాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే రూ.300 సబ్సిడీ నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈకేవైసీని తీసుకొచ్చింది. ఒకే వ్యక్తి రెండు కనెక్షన్లను ఉపయోగిస్తుండటం, మరణించినవారి పేర్లపై సబ్సిడీని పొందుతుండటం వంటి వాటిని అరికట్టేందుకు ఈ ప్రక్రియను తప్పనిసరి చేసింది. డొమెస్టిక్ వినియోగదారులే కాకుండా సాధారణ నాన్ సబ్సిడీ సిలిండర్లు వాడేవారు కూడా కేవైసీ పూర్తి చేయాలి.

ఇక కమర్షియల్ సిలిండర్లు వాడేవారికి ఆధార్ ఈకేవైసీ అవసరం లేదు. అయితే గృహ సిలిండర్ల వినియోగదారులు గ్యాస్ కేవైసీ పూర్తి చేయడానికి గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఇండియన్ ఆయిల్ వన్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు హెచ్‌పీ గ్యాస్, భారత్ గ్యాస్ వినియోగదారులు భారత్ గ్యాస్ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకుని కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఆధార్ ఆర్డీ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఫేస్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇందుకు అవసరం. ఇక ఆఫ్ లైన్ విధానంలో గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి మీ ఆధార్ ,గ్యాస్ పాస్ బుక్ అందించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర ఉండే బయోమెట్రిక్ మెషీన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయవచ్చు. ఇలా మూడు విధాలుగా ఆధార్ కేవైసీ పూర్తి చేయవచ్చు.

Follow Us